టేబుల్ టెన్నిస్

చరిత్ర:

పూర్వము ఈ ఆటను “పింగ్-పాంగ్” యని పిలిచేవారు. తరువాత “టేబుల్ టెన్నిస్” యని క్రొత్త పేరు ఇవ్వబడింది. తొలుత యూరోపియన్ దేశాలైన ఇంగ్లాండు, హంగరీ, చెకోస్లోవేకియా, రుమేనియా, యుగోస్లావియాలలో ఎక్కువగా ఆడేవారు. ఆధునిక టెబుల్ టెన్సిస్ ఇండియాలో బ్రిటీష్ ఆర్మీ ఆఫీసర్ల ద్వారా ప్రచారములోనికి వచ్చింది.

1926 సం.లో యూరప్‌లో టేబుల్ టెన్నిస్ ఆటకు విశేష ఆదరణ లభించింది. టేబుల్ టెన్నిస్ రంగంలో యూరోపియన్ దేశాలు ఆదిక్యత నిలబెట్టుకొన్నాయి. అయితే 1952 సంuలో బొంబాయిలో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలలో టేబుల్ టెన్నిస్‌లో యూరప్ ఆధిపత్యానికి గండి పడింది. తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్ షిప్ జపాన్‌కు చెందిన పిరోజపాలో గెలుపొందెను. తరువాత యూరప్ దేశాల నుండి ఆధిపత్యం ఆసియాకు మారింది. జపాన్, చైనా దేశాలు ఈ ఆటలో అద్భుతమైన గొప్ప క్రీడాకారుల్ని ప్రపంచానికి అందించెను. ఈ మధ్య కాలంలో భారత దేశంలో కూడా ఆట బాగా ప్రజాదరణ పొంది అనేక మంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు తయారు చేయబడెను. టెన్నిస్ ప్రస్తుతము ఒలింపిక్స్‌లో కూడా చేర్చబడింది.

చాతుర్యములు (Skills):

Grip: Backhandgrip,Forehandgrip, Backspin grip, Top Spin grip, 2.Fore hand shot, 3. Back Hand Shot, 4. Stance, 5. Service, 6. Side Spin, 7. Top Spin, 8. Back Spin, 9. Push Shot, 10. Chap, 11. Back Return, 12. Drive, 13, Smash, 14, Drop Shot.

టేబుల్, నెట్ యొక్క కొలతలు:

టేబుల్పొడవు                            2.74 మీ.

టేబుల్వెడల్పు                      1.525 మీ.

నేలపైనుండి ఎత్తు –                76 సెం.మీ.

నెట్ పొడవు –                                   1 .82 మీ.

టేబుల్నుండి నెట్ ఎత్తు       15.25 సెం.మీ.

ప్లేఏరియా పొడవు- వెడల్పు – 14 x 75.

బంతి కొలతలు:

బంతిబరువు –                                     2.5గ్రా

బంతి చుట్టుకొలత-                  4 సెం. మీ.

రంగు –                               తెలుపు ,ఆరంజ్

అధికారులు:                                         – 2

మ్యాచ్స్:

7 గేములు ఆడవలెను.
ప్రతి మ్యాచ్ గెలుపుకు 11 పాయింట్స్ పొందలెను.

టైమ్ అవుట్ – 1 ని ఇవ్వబడును.
గేముల మధ్య విరామము – 2 ని ఇవ్వబడును.

Order Points of Play:

సింగిల్స్‌లో సర్వీసు చేసే క్రీడాకారుడు వరుసగా ఐదుసార్లు సర్వీసు చేస్తాడు. తన సర్వీసులో పాయింట్స్ పొందవచ్చును లేదా పొందక పోవచ్చును. తర్వాత రెండవ ఆటగానికి కూడా ఐదు సర్వీసులు ఇవ్వబడును. అనగా ప్రతి ఐదు సర్వీసులకు పాయింట్స్ వస్తే ఆటగాడు మారాల్సి వుంటుంది. డబుల్స్‌లో సర్వీసు ఆటగాడు మొదట చేసిన సర్వీసును ఎదుటి వర్గపు ఆటగాడు అందుకుని సమర్ధవంతంగా తిరిగి పంపవలయును. సర్వీసు చేసిన క్రీడాకారుడు లేదా తోటి క్రీడాకారుడు బంతిని తిరిగి ప్రత్యర్ధి కోర్టులోకి సమర్థవంతంగా పంపవలెను. ఈ విధంగా ప్రతి ఆటగాడు వంతులవారిగా ఒకరి తరువాత ఒకరు బంతిని కోర్టులలోకి పంపవలెను.

Good Service :

వ్రేళ్ళు ఒకదానిలో ఒకటి జొప్పించబడి వున్న అరచేతిలో బంతి వుంచుకొని ఆటగాడు సర్వీసు చెయ్యాలి. సర్వీసు చేసేటప్పుడు బంతి స్పష్టంగా కనబడాలి. బంతిని కనపడేట్టు ఎగరేసి సర్వీసు చేసినప్పడు అది సర్వీసు చేస్తున్న ఆటగాని కోర్టుని నెట్ మీదుగా దాటి ప్రత్యర్ధి కోర్టులోకి వెళ్ళవలెను. డబుల్స్‌లో మొదట బంతి సర్వీసు ఆటగాని కుడిచేతిని తాకి కుడివైపు కోర్టు మీదుగా లేక సెంట్రల్ లైన్ మీదుగా నెట్‌ని దాటి ప్రత్యర్ధి కోర్టులో అర్ధభాగం మీదుగాగాని, సెంట్రల్ లైన్ మీదుగా గాని అందుకోవలసిన వానివైపు వెళ్తుంది. –

A Good Return :

సర్వీసు చెయ్యబడిన బంతిని తిరిగి అవతలి ఆటగాడు తిప్పికొట్టినప్పుడు అది

సూటిగా నెట్ మీదుగా ప్రత్యర్ధి కోర్టులో ఏ భాగానైనా తాకవచ్చును. సర్వీసు చేయు క్రీడాకారుని కుడి కోర్టు నుండి రిసీవ్ చేసి కుడి ఆఫ్ కోర్టులోకి సర్వీసు చేయవలెను. సర్వీసు నెట్‌ని దాటి ప్రత్యర్థి కోర్టుకి పంపవలెను.

ఈ క్రింది పరిస్థితుల్లో ఆట పరిగణించబడదు :

బంతి ఒకే కోర్టును రెండుసార్లు తాకినట్టయితే, బంతి ఆటగాడిని కానీ, అతని దుస్తులని కానీ తగిలినపుడు, బంతి ఆటగానికి ఒకటి కంటే ఎక్కువసార్లు వరుసగా కొట్టబడితే, బంతి ఆటగాన్ని లేదా అతను ధరించిన దుస్తువులను గాని మరే వస్తువునయినగానీ రాకకూడదు.

ఒకవేళ బంతి దొర్లినట్టయితే, బంతి నెట్నికాని దాని ఆధారాలను గాని, మరేదైనాగాని తాకితే, డబుల్స్‌లో బంతి ఆటగాడికి ఎడమవైపు కోర్టులోకి వెళ్లినపుడు, డబుల్స్‌లో టీమ్‌కు సంబంధించిన క్రీడాకారుడు కొట్టినపుడు,

Let :

సర్వీసు సక్రమమైనదై నెట్ మీదుగా వెళ్లు నెట్‌ని గానీ, సపోర్టర్స్నిగానీ తాకితే అది ర్యాలీగా కాక “లెట్”గా భావించబడుతుంది. సర్వీసు చేసేటప్పుడు ఆటగాడు సిద్ధంగా లేకపోతే, సర్వీసు చేసే ఆటగాడు లేక అందుకునే ఆటగాడు ఎవరయినా ప్రమాదం జరిగినపుడు సర్వీసు చెయ్యడం లేక రిసీవ్ చేయుటకు వీలులేకపోతే, పొరపాటును సరిదిద్దడం కోసం ఆట ఆగిపోయినట్టయితే, ఆటకి ఏదైనా అభ్యంతరం ఏర్పడినప్పడు.

Points:

రూల్స్ అతిక్రమించినట్టయితే పాయింట్‌ను కోల్పోయే పరిస్థితులు :

1)ఆటగాడు ఒకవేళ సక్రమమైన సర్వీసు చేయడంలో విఫలమైతే,

2) ప్రత్యర్ధికి స|కమంగా బంతిని తిప్పికొట్టడంలో విఫలమైతే,

3) ఆట సాగుతున్నప్పుడు ఆటగాడు తాను ఆడుచున్న స్థలాన్ని మారిస్తే,
4) ఆట సాగుతున్నప్పుడు ఆటగాని ఖాళీ చెయ్య భూమిని తాకితే,

5) తాను ఆడుచున్నవైపు ఆట మైదానం అంతా కాకుండా బంతి కోర్టు చివరి గీతమీదుగా లేక సైడ్ గీతల మీదుగా వెళ్ళినట్టయితే,

6) ఒకవేళ ఆటగాడు దొర్లిన బంతిని తిప్పికొట్టనట్టయితే,

7) డబుల్స్‌లో ఆడవలసిన క్రమమును తప్పి ఆటగాడు బంతిని కొట్టనట్టయితే,

8) ఆటగాడు సర్వీసు చేసినప్పుడు ప్రత్యర్థి క్రీడాకారుడు బంతిని సక్రమముగా పంపకపోతే.

Game:

ఒక ఆటగాడు లేక టీము 21 పాయింట్లు సాధిస్తే గేము గెలిచినట్లుగా ప్రకటించబడును. అయితే రెండు టీములు 20 పాయింట్లు సమానముగా సాధించి నట్లయితే రెండు పాయింట్లు ఎక్కువగా ఏ టీము ముందుగా సాధిస్తే ఆ టీము గెలిచినట్లుగా ప్రకటించబడును.

Matches :

మ్యాచ్‌లు రెండు లేదా అయిదు కలిగి ఉండును. అయితే మూడు నాలుగు గేముల మధ్య అయిదు నిమిషములు విరామము ఇవ్వబడును. మిగతా గేములకు ఒక్క నిమిషము మించకుండా విరామము ఇవ్వబడును.

Selection of Sides and Service :

కోర్టు లేదా సర్వీసు మొదట ఎవరు చెయ్యాలన్న విషయము టాస్ ద్వారా నిర్ణయింపబడతాయి. టాస్ గెల్చుకున్న ఆటగాడికి, ఆటగాళ్ళు తాను సర్వీసు చెయ్యాలో లేక సర్వీసును అందుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుంది.

డబుల్స్‌లో మొదట అయిదు సర్వీసులూ చెయ్యగలిగిన అవకాశం వచ్చిన ఆటగాళ్ళు తమ ఇద్దరిలో ఎవరు మొదట తమలో సర్వీసు చెయ్యూలో నిర్ణయించుకోవచ్చు. అలాగే ప్రత్యర్థి వర్గంలో ఆటగాళ్ళు మ్యాచ్‌లో మొట్టమొదటి ఆటలో మొట్ట మొదటి సర్వీసు ఎవరు చేస్తారో నిర్ణయించుకోవచ్చు.