బ్యాడ్మింటన్

.                                              షటిల్ బ్యాడ్మింటన్

చరిత్ర
షటిల్ బ్యాడ్మింటన్ 20 శతాబ్దంలో ప్రపంచమంతటా ప్రాచుర్యం పొందిందిఅన్ని దేశాలలోను అత్యంత ఆసక్తితో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు ఆట మొట్టమొదట  దేశంలో ఆడడం ప్రారంభమయిందో తెలియజేసే ఆధారాలు ఏమీ లేవుఅయితే చైనాలో  ఆట పుట్టిందని కొందరి వాదన.
భారతదేశంలో మొట్టమొదట  ఆట ఇన్డోర్ గేమ్‌గానే ప్రారంభమైందిఆధునిక షటిల్ బ్యాడ్మింటన్ గేమ్‌ని బ్రిటీష్‌వారు ఇండియాలో ప్రవేశపెట్టారని చరిత్రకారులు పేర్కొన్నారు.
డ్యూక్ ఆఫ్ బ్యూపోర్టు అను ఎస్టేటులో డ్యూక్ ఆఫ్ బ్యూపోర్ట్ ఎస్టేట్‌లో మొట్టమొదట  ఆటను జరిగిందికనుక  ఆటకు  ఎస్టేట్ పేరు పెట్టినట్లు చెబుతారు
1934 సంవత్సరంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏర్పడింది
194849 సంవత్సరంలో ధామస్ కప్ పోటీలు నిర్వహించారుభారతదేశంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ 1934 సంవత్సరంలో ఏర్పడిందిఅదే సంవత్సరంలో ఆల్ ఇండియా బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు కలకత్తాలో నిర్వహించారు.

 

 
కోర్టు కొలతలు                                                డబుల్స్ గేమ్ సింగిల్స్ గేమ్
 
 
కోర్టు పొడవు               13.40 మీ. 13.40 మీ.
 
కోర్టు వెడల్పు             6. 10 5. 18మీ

 

 
పోల్స్, నెట్ కొలతలు

 


1.
పోల్స్ భూమిపై నుండి పొడవు 1.98 మీ.
 
2.నెట్ పొడవు                                  6. 10మీ.
 
3.నెట్ వెడల్పు                             76 cm 
 
4.నెట్ ఎత్తు (పోలు దగ్గర నెట్ ఎత్తు)1. 55మీ 
 
5.సెంటర్ లైన్ దగ్గర నెట్ ఎత్తు1. 52మి
కాక్ కొలతలు
 
 1. షటిల్ కాక్ బరువు 4.74 నుండి 5.50 గ్రాములు 
 
 2.కాక్‌లోని ఈకల సంఖ్య 14 నుండి 16
 
 3.కాక్ బాటం కొలత 25 .నున్ది      28
 
రాకెట్ కొలతలు 
 
1. రాకెట్ ఫ్రేమ్ యొక్క పొడవు 680m.m
 
2. రాకెట్ ఫ్రేమ్ యొక్క వెడల్పు 230mm 
 
మ్యాచ్‌ల సంఖ్య
 
1. డబుల్స్‌కి పాయింట్స్ 15 లేదా 21
 
2. సింగిల్స్‌కి పాయింట్స్ 11
 
చాతుర్యములు (Skills)
 
1.
Grip: Forehand Grip, Backhadn
Grip

2.Service:Shortservice, Long Service

3. Return 4. Fore Hand 5. Fore Hand Smash 6. Fore Hand Over Head Stroke 7. Back
hand underarm clearstroke 8. Backhand drive 9. Back hand overheadstorke 10.
Netshots 11. Drive

(Rules of the Game & Match)


1.
ఆట ప్రారంభానికి ముందుగా రెండు టీములకు టాస్ వేయాలి. టాస్ గెలిచినవారు, సర్వీసుగాని, కోర్టుగాని కోరుకోవాలి.
పురుషుల డబుల్స్ గేమ్గాని, సింగిల్ గేమ్గాని 15 లేక 21 పాయింట్లుగా గేమ్ ఉండును. 15 పాయింట్లకు ఆట జరుగు సమయంలో రెండు టీములు 13 పాయింట్లు దగ్గర సమానమైనచో మొదట 13 పాయింట్లకు చేరిన టీము, 5 పాయింట్లకు ఆటను సెట్టింగ్‌గా ఆడవచ్చును.
14 పాయింట్ల దగ్గర సమానమైనచో, మొదట 14 పాయింట్లకు చేరిన టీము, 3 పాయింట్లకు గేమ్‌ను సెట్టింగ్ అడగవచ్చును. గేమ్ మొదట ప్రారంభించినప్పుడులవ్ ఆల్ అని అందురు.
 
13 పాయింట్లు లేక 14 పాయింట్ల దగ్గర సమానమైన టీములు టీము ముందుగా 5 పాయింట్లు లేక 3 పాయింట్లు సంపాదిస్తారో టీమును విజేతగా నిర్ణయిస్తారు.
21 పాయింట్లతో ఆట జరుగుతున్నప్పుడు 13 లేక 14 పాయింట్ల దగ్గర సమానమైన తరువాత, సర్వీసు చేయులోపల సెట్టింగ్ అడగవలెను. అయితే 19 మరియు 20 పాయింట్లు దగ్గర సెట్టింగ్ అడగవలెను.
స్త్రీల సింగిల్స్ గేమ్‌లో 11 పాయింట్లు కలిగి యుండును. మొదట 9 పాయింట్లకు చేరిన క్రీడాకారిణి సెట్టింగ్ అడగవచ్చును. మూడు పాయింట్లు సెట్టింగ్‌గా యుండును.
10 పాయింట్లకు మొదట చేరిన క్రీడాకారిణి 2 పాయింట్లకు సెట్టింగ్ అడగవచ్చును.
మొదటి అవకాశంలో సెట్టింగ్ ఆడగని టీమ్ రెండవ అవకాశంలో సెట్టింగ్‌ని వినియోగించు కొనకూడదు.
ఆటలో డిస్లొకేషన్ ఏర్పడితే సెట్టింగ్ అడగకూడదు.
 
(Faults)
 
కోర్టు లోపల క్రీడాకారులు తప్పుచేసిన, సర్వీసు ఎదుటి టీము కోర్టులోకి వెళ్ళకపోతే ఎదుటి టీముకి పాయింట్ వచ్చును. సర్వీసు చేయునపుడు, సర్వీసు చేయు క్రీడాకారుని నడుము పై భాగం నుండి షటిల్‌ని కొట్టడం తప్ప, సర్వీసు చేయు క్రీడాకారుని రాకెట్ పట్టుకున్న చేతికున్న పైకి షటిల్‌ని పట్టుకోవడం తప్ప. సర్వీసును తప్ప కోర్టులోనికి చేసిన, షార్డు సర్వీసు లైను లోపలబడిన, సర్వీసు లైను దాటిపడిన, సైడ్ లైన్లు దాటి బయటపడిన సర్వీసు తప్పుగా నిర్ణయిస్తారు.