షాట్ పుట్

షాట్ పుట్ కొలతలు


షాట్‌పుట్ త్రోయింగ్ అంశంలో ఉన్నప్పటికి అధికారికి నిబంధన ప్రకారం షాట్పట్ పుష్ చేయాలి కాని విసర కూడదు. షాట్‌పుట్ యెడల దానిని తప్పుగా నిర్ణయించబడును.

 

షాట్ పుట్ మూడు పద్ధతులు గా విభజించబడెను.

 

1)Standing Style 2) Parry O’brien Style 3) Disco Style

ParryObrien అమెరికా దేశస్థుడు. 1956, 1960 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో కొత్త శైలితో షాట్‌పుట్‌ను విసిరి బంగారు పథకములను గెలుపొందెను. ఆయన త్రో చేసిన శైలిని ఆయన పేరుతో ParryO’brien Style అని పిలుస్తారు

చాతుర్యములు:

1) Hold 2) Stance 3) Glide 4) Release or Dilivery 5) Reverse

 

షాట్‌పుట్ పట్టుకొను పద్ధతులు

 

 

మొదటి పద్ధతి:

షాట్పుట్ని వ్రేళ్ళ క్రింద భాగాన వుంచి, ఐదు వ్రేళ్ళను సమానంగా వెడల్పుచేసి పట్టుకొనుట. ఈ పద్ధతి హైస్కూల్ విద్యార్థులకు అనుకూలంగా వుండును.

రెండవ పద్ధతి

ఐదు వ్రేళ్ళు బాగా వెడల్పుచేసి, చిటికిన వ్రేలిని Curlరూపంలో వుంచి పట్టుకొనుట. ఈ పద్దతి వేళ్ళ పొడవుగా వున్నవారికి అనుకూలంగా వుండును
.
మూడవ పద్ధతి:

నాలుగు వేళ్ళను దగ్గర వుంచి, బొటన వ్రేలు సహాయంతో షాట్‌పుట్‌ను పట్టుకొనుట ఈ పద్ధతి వేళ్ళు పొట్టిగా వున్నవారికి అనుకూలంగా వుండను.

షాట్‌పుట్ సర్కిల్ నిర్మాణం

షాట్‌పుట్ సర్కిల్ నిర్మించుట కొరకు 2,135 మీ. వ్యాసంతో వృత్తంను గీయుము. వృత్యం మధ్య బిందువు ‘O’ నుండి”A” బిందువు వరకు వెళ్ళు మార్గం “D” బిందువు దగ్గర వృత్తమును ఖండించుము. “A” బిందువు ద్గర నుండి 6.84 మీ. తో “A” బిందువుకు ఇరువైపుల చాపములను గీయుము. ఈ చాపములను ఖండించుటకు వృత్తం మధ్యగల”O” బిందువు నుండి 20 మీ. కొలతతో చాపములను గీయుము. ఈ చాపములచే
ఖండింపబడగా వచ్చిన బిందువును “B”, “C” లుగా గుర్తింంచుము. “B”, “C” లను వృత్తం మధ్యగల వును కలుపుతూ గీత గీయుము. “O” బిందువు దగ్గర 34.92″ కోణం ఏర్పడును. “D” బిందువు దగ్గర మండి 3 మీ. పొడవు గల చాపములను వృత్తమునకు ఇరువైపులా గీయుము. అదే విధంగా “D” కి ఎదురుగా వృత్తం మీదనున్న “E” బిందువు నుండి ఇంతకు ముందు వృత్తం బయట గీచిన చాపములను ఖండించుము. “F”, “G” అను బిందువులు ఏర్పడును. “F”, “G” లను కలిపిన వృత్తం మధ్యగీత వచ్చును. ఈ విధంగా షాట్‌పుట్ సర్కిల్ ఏర్పడును.

షాట్ పుట్

 

సెక్టర్ యాంగిల్‌ని లెక్కకట్టు పద్దతి

షాట్ పుట్ నిర్మాణ దిశ ఉత్తర, దక్షిణములు
రింగ్ చుట్టుకొలత 2.135 మీ.
రింగ్ వ్యాసార్థం 1.0675 మీ.
సెక్టరు కోణం 34.92*డిగ్రీ లు

చుట్టుకొలత సూత్రం = 26r=2×227 x 10674=|671

అర్ధవృత్తం = 6.71/2 = 3.855 మీ.

= 6.71 x 34.92″/360″ = 0.65087

= 0.65 సెం.మీ.
= 2.705/2 = 135.2 సెం. మీ.

సెక్టరు ఇరువైపుల దూరం = 135.2 సెం.మీ.

షాట్‌పుట్ సర్కిల్ కొలతలు

1. షాట్‌పుట్ సర్కిల్ వృత్తం

2.135 మీ. 2. స్టాప్ బోర్డు పొడవు 1.25 మీ.

3. స్టాప్బోర్డు ఎత్తు 10 సెం.మీ

5. సున్నపు గీతల మందం 5 సెం.మీ.

6. Sectar Flags పొడవు మరియు వెడల్పు 60 x 20 సెం.మీ.

7. Sectar Flags ఎత్తు 40 సెం.మీ.

8. సెక్టరు కోణం 34.92 డిగ్రీలు

షాట్‌పుట్ బరువు

పురుషులకు 7.26 కిలోలు చుట్టుకొలత 110-130 మి.మీ.

బాలురు 6 కిలోలు చుట్టుకొలత 105-125 మి.మీ.

స్రీలకు 4 కిలోలు చుట్టుకొలత 95–110 మి.మీ.

నిబంధనలు

1. షాట్‌పుట్‌ను సర్కిల్ నుంచే వేయవలెను.

2. షాట్‌ను ఏదైనా ఒక చేతితోనే వేయవలెను.

3. షాట్‌ను వేసేటప్పుడు షాట్‌ని భుజము వెనక్కి తీసుకొనరాదు.

4. షాట్‌ను భుజము వెనక్కి నుండి తీసుకొని వేసిన దానిని తప్పుగా పరిగణింతురు.

5. పోటీదారులను లాటరీ పద్ధతి ద్వారా తీసి వరుస ప్రకారం పోటీలు నిర్వహించవలెను.

6. పోటీదారుడు స్టాప్ బోర్డు లోపల భాగంను తాకవచ్చును. పై భాగంను గాని లేక సర్కిల్ బయటి భాగమును తాకిన అది తప్పుగా పరిగణింపబడును.

7. షాట్ భూమిని తాకే వరకు పోటీదారుడు సర్కిల్ వదలి వెళ్ళకూడదు. భూమిని షాట్ తాకిన తరువాత సర్కిల్ వెనుక అర్ధభాగం నుంచి బయటికి వెళ్ళవలయును.

8. షాట్‌పుట్ 34.92 డిగ్రీల కోణంలోని సెక్టార్ గీతల మధ్య పడవలెను. అయితే సెక్టార్ గీతలపై పడకూడదు.

9. షాట్పట్ పడిన చోట దగ్గర పాయింట్ నుండి కొలత తీసుకొనవలయును.

10. షాట్పట్ గుండ్రంగా, నున్నగా ఉండవలెను.

11 షాట్పట్ పోటీని ఇద్దరు జడ్జీలు నిర్వహించెదరు.

గమనిక:
షాట్‌పుట్టర్ సుమారు 39 డిగ్రీల నుండి 45 డిగ్రీల యాంగిల్లో షాట్‌ని రిలీజ్ చేయవలెను.

 

Sharing is caring!