హైజంప్

                                           హైజంప్

హైజంప్ దూకు విధానంలో 3 స్టెల్స్గా విభజింపబడెను. 

 1. వెస్టర్న్ రోల్ (Modified as Belly or Straddle Roll)
 1. ఈస్టర్న్ 5°5 (Modified as Scissors Style)
 1. ఫాస్బరి ప్లాఫ్

చాతుర్యములు (Skills)

1) అప్రోచ్ 2) టేకాఫ్ 3) క్రాసింగ్ ది బార్ 4) లాండింగ్

కొలతలు 

 1. పోల్ ఎత్తు 3.66 మీ.
 1. పోల్కి పోల్కి మధ్య దూరం 4 నుండి 4.04 మీ. 
 1. రన్‌వే 15 నుండి 20 మీ. 
 1. ల్యాండింగ్ ఏరియా పొడవు, వెడల్పు 5 x 3 మీ. 
 2. క్రాస్ బార్ పొడవు 4 మీ.
 1. క్రాస్ బార్ బరువు 2 కె.జి.లు
 1. క్రాస్ బార్ నిలువు ఫ్లాట్‌ఫామ్ వెడల్పు 4 సెం.మీ. 1. క్రాస్ బార్ నిలువు ప్లాట్ఫారం పొడవు 6 సెం.మీ.
 1. క్రాస్ బార్ టేకు కొయ్యతో లేక లోహంతోగాని చేసి ఉండవలయును.
 1. క్రాస్ బార్ నలుపు మరియు తెలుపు రంగులు కలిగి ఉండాలి.

                                               Practicing the High Jump Techniques

                                   Fosbury Flop Style

N.B.: Dick Fosbury  క్రీడాకారుడు అమెరికా దేశస్టుడు. హైజంప్‌లో ఈయన 1968 సంవత్సరంలో మెక్సికోలో జరిగిన ఒలంపిక్స్‌లో 

ఈ కొత్త శైలితో జంప్‌చేసి బంగారు పథకంను గెలుపొందెను. అతను జంప్ చేసిన శైలిని Fosbury Flop అని పిలువబడుచున్నది.

                           నిబంధనలు:

1హైజంప్ పోటీదారుడు టేకాఫ్ ఒకే కాలు పాదంతో తీసుకొనవలయును

2.క్రాస్ బార్ ట్రెయాంగులర్ ఆకారంలో ఉండవలెను.

3.క్రాస్ బార్ని తన్నటం, బార్ని క్లియర్ చేయకుండుటను, 

పోటీదారుని అవకాశం (Attempt) తప్పుగా (Foul) పరిగణించబడును.

4.పోటీ అంతమయ్యేవరకు హైజంప్ పోల్స్‌ను జరుపకూడదు. 

అధికారి అనుమతితో దూకుటకు ఇబ్బందికరంగా ఉంటే కొద్దిగా పోల్స్ (poles) ను జరుపుకొనవచ్చును.

5.న్యాయ నిర్ణేతలు తక్కువ ఎత్తు నుంచి జంప్స్ను ప్రారంభించవలయును. 

6.పోటీదారులు పోటీలో పాల్గొనవచ్చును. కాని నిర్ణయించబడిన ఎత్తును దూకవలయును.

7.నిర్ణయించిన ఎత్తును మూడుసార్లు దూకలేని పక్షమున మరల 

ఆ పోటీదారుడు పోటీలో పాల్గొనుటకు వీలు పడదు. అతన్ని పోటీ నుంచి తొలగింతురు.

8.పోటీదారుడు దూకిన ప్రతి ఎత్తును కొలత తీసుకొనవలెను.

9.ప్రతి ఎత్తును క్లియర్ (Clear) చేయుటకు పోటీదారునికి 3 అవకాశములు (Attempts) ఇవ్వబడును

10.ఒక ఎత్తు క్లియర్ చేసిన  తరువాత నిర్ణేతలు 2 సెమి పెంచుతూ  పోటిని నిర్వహించాలి 

 కంబైన్డ్  టోర్నమెంట్ లో 5 సెమీ  పెంచుతూ  పోటిని నిర్వహించాలి 

                                        Tie Break:

హైజంప్‌లో Tie ఏర్పడినపుడు ఈ విధంగా నిర్ణయించబడును.

 1. Tieఇచ్చిన ఎత్తు దగ్గర పోటీదారులు ఎన్ని తక్కువ అవకాశములు(Attempts) తీసుకొన్నది మొదట చూడవలెను.
 1. అప్పటికి Tie ఉండే, పోటీ ప్రారంభించినప్పటి నుండి చివరి వరకు పోటీదారుల్లో ఎవరు తక్కువ fouls చేస్తే ఆ పోటీదారుని విజేతగా నిర్ణయించవలెను.
 1. ఇంకను Teఉన్నటైతే ఏ పోటీదారులు వైఫల్యం చెందిన ఎత్తును మరి ఒకసారి దూకించాలి. ఎవరు ఆ ఎత్తును క్లియర్ చేస్తే అతనిని విజేతగా నిర్ణయించవలయును.
 1. ఇంకా Tieఉన్నట్టైతే ఎత్తును 2 సెం.మీ. తగ్గిస్తూ దూకించవలెను. ఈ సమయంలో పోటీదారునికి ప్రతి ఎత్తు దగ్గర ఒక అవకాశం ఇవ్వవలెను. దీనిని జంప్ ఆఫ్ అని అందురు. ఈ విధంగా ఎవరు ఆ ఎత్తును ఒకేసారి దూకుతారో వారిని విజేతగా నిర్ణయించవలెను.
 1. ఒకవేళ Te2 లేదా 8వ స్థానాలకు ఉన్నట్లయితే మొదట తెలిపిన రెండు పద్దతుల ద్వారా నిర్ణయించవలెను.
 1. ఇంకను 2, 3 స్థానాలకు Teఉన్నట్లయితే ఇద్దరిని సంయుక్త విజేతలుగా నిర్ణయిస్తారు.