బాల్ బ్యాడ్మింటన్

 

బాల్ బ్యాడ్మింటన్

 

చరిత్ర

 
బాల్ బ్యాడ్మింటన్ భారతీయ ఆట. ఈ ఆట మద్రాసు రాష్ట్రంలోని తంజావూరులో 18563 సంవత్సరంలోప్రారంభించబడెను.
ఈ ఆట దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందింది.
 
 1930వ సంవత్సరంలో బాల్‌బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించారు. 1954వ సంవత్సరంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పడింది. తరువాత ఈ ఆట మన దేశంలోనే అన్ని రాష్ట్రాలలో ఎంతోప్రాచుర్యం పొందింది. 
 
1987లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాన్ ఒలింపిక్ నేషనల్ గేమ్స్, కేరళ రాష్ట్రంలో నిర్వహించారు. 
అప్పటి నుంచి బాల్‌బ్యాడ్మింటన్ ఆటలో ఒలింపిక్ అసోసియేషన్ కూడా పాల్గొనుచున్నది. ప్రస్తుతం బి.బి.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో అన్ని రకముల టోర్నమెంట్స్, ఇతర గేమ్స్ మాదిరిగా బాల్‌బ్యాడ్మింటన్ ఆటను మన దేశంలో నిర్వహించారు.

చాతుర్యములు: 

ఈ ఆటలో క్రీడాకారులు కింది నైపుణ్యాలుసాధించాలి.1. Grip,2. Services: Low Service, High Service-ScrewService, Drive & Flick Service,
3.Return,4.Floating,5.fore Hand Stroke,6.Top Spin, 7. Drop Shot, 8. Push Shot.మ్యాచ్: నియమ నిబంధనల ప్రకారం టీములు 3 గేమ్స్ ఆడవలయును.

 

బాల్ బ్యాడ్మింటన్
కోరుకొలతలు

1. కోర్డు పొడవు                     24 x 12 మీ,

2.వెడెల్పు                           24x 6 మీ.

4. లైన్ల మందము            5 సెం.మీ

నెట్ కొలతలు

1. నెట్ పొడవు –                13.5 మీ

2. నెట్ వెడల్పు –              1 మీ

3. గ్రౌండ్ నుంచి నెట్ యొక్క ఎత్తు –            183 సెం.మీ

4. పోల్ దగ్గర నుండి నెట్ యొక్క ఎత్తు      185 సెం.మీ,

బాల్ మరియుబ్యాట్ కొలతలు

1. బాల్ బరువు –                                                   22 మండి-23_గ్రామ

2. బాల్ చుట్టుకొలత –                                          5 నుండి 5.5 సెం.మీ

3. బాల్ రంగు – పసుపు

4. బ్యాట్ పొడవు –                                                63 నుండి 70 సెం.మీ.

5. బ్యాట్ వెడల్పు –                                           20 నుండి 22 సెం.మీ.

6. బ్యాట్ బరువు –                                             200 నుంచీ, 250 గ్రాములు

పోస్టు మరియు పోల్ కొలతలు

1. పోస్టుల ఎత్తు –                                            మీ.1.98

2. పోల్ ఎత్తు –                                                  183సెం.మీ.

3. Hook –                                                           1. 50 సెం.మీ.

క్రీడాకారులు

1. ప్రతి టీములో క్రీడాకారుల సంఖ్య – 7

2 ప్రతి మ్యాచ్‌లో ఆడవలసిన క్రీడాకారుల సంఖ్య – 5  మంది

3. ప్రతి టీము సబ్స్టిట్యూట్స్ – 2

4.బనియన్ నంబర్            10X15 సెం.మీ.

ఆట నియమములు

 

1. సర్వీసుని ప్రతి క్రీడాకారుడు కుడి కోర్టు డైయాగ్నల్గా బంతిని ఎదుట కోర్టులోనికి సర్వీసు చేయాలి. పాయింటు వచ్చిన తరువాత ఎడమ కోర్టుకి మారి సర్వీసు చేయవలయును.
అదే విధంగా పాయింట్స్ వస్తున్నప్పుడు కోర్డులు మారుతూ సర్వీసులు చేయవలయును.

2. ప్రతి ఆటలో 8,15,22 పాయింట్ల దగ్గర కోర్టులు మారవలెను. కోర్టు మారిన తరువాత కూడా ఇతడు ముందున్న కోర్టులో ఎక్కడి నుండి సర్వీసు చేస్తారో అక్కడి నుండి సర్వీసు చేయాలి.

3. సర్వీసు చేస్తున్న ఆటగాడి నడుముకు కింద నుండి సర్వీసు చేయవలెను. స్పష్టంగా నెట్ పై నుండి బంతి వెళ్ళాలి.
నెట్ అవతల ఎదుటివారి కోర్టులోని సర్వీసు క్రీజ్లైన్ని దాని బంతి వెళ్ళవలెను.
నడుముకి పై నుండి సర్వీసు చేసిన దానిని ఓవర్ హ్యాండ్ అని అంటారు. దీనిని తప్పుగా పరిగణించబడును.
4. బంతిని నెట్‌కి తగలకుండా ఎదుటి కోర్టులోకి పంపవలెను.

5. ఆటలోని క్రీడాకారులు బంతిని వరుసగా రెండు సార్లు బ్యాట్‌తో కొట్టకూడదు.

6. ఎదుటి కోర్టులోని క్రీడాకారులు సిద్దంగా లేనపుడు సర్వీసు చేయకూడదు. ఎదుటి టీము క్రీడాకారులు
బంతిని నెట్‌కి తగలకుండా ఎదుటి కోర్టులోకి పంపవలెను. ఆటలోని క్రీడాకారులు బంతిని వరుసగా రెండు సార్లు బ్యాట్‌తో కొట్టకూడదు.
ఎదుటి టీము క్రీడాకారులు ఎవరైనా బంతిని తీయుటకు ప్రయత్నించిన, ఆ టీము సిద్ధంగా ఉన్నట్లు పరిగణించబడును.

7.. ఆట జరుగుచున్నపుడు టీములోని క్రీడాకారులు ఎవ్వరు కూడా అధికారుల అనుమతి లేనిదే బయటకు వెళ్ళకూడదు.

8. క్రీడాకారులు ఆట జరుగుచున్నప్పుడు నెట్లైన్ క్రాస్ చేయకూడదు. –

9. సర్వీసును తీసుకొన వారెవరైనా, బంతి కోర్టులోని గ్రౌండ్‌ని తగలకముందే బంతిని తిరిగి ఎదుట కోర్టుకి పంపవలెను. .

10.సబ్స్టిట్యూషన్ రెండు లేక మూడవ ఆటలో చేసుకొనవచ్చును. అయితే అంపైర్ అనుమతితో బాల్ డెడ్ అయినప్పుడు సబ్స్టిట్యూట్స్ చేసుకొనవచ్చును.
సర్వీసు చేయుటకు ముందు మాత్రమే సబ్స్టిట్యూషన్ చేయవలెను.

11. మూడు సెట్స్ పూర్తి అయ్యేవరకు బంతిని మార్చకూడదు. అయితే బంతి పనికిరాని యెడల అంపైర్ తన విచక్షణాధికారంతో బంతిని మార్చవచ్చును.

12తప్ప జరిగిన ఎదుటి టీముకు పాయింట్ వచ్చును. లేదా సర్వీసు ఇవ్వబడును.

Fouls

1.సర్వీసు చేయు క్రీడాకారుడు స్థిరంగా నిలబడకుండా, కాలుపైకి ఎత్తి సర్వీసు చేసిన దానిని తప్పుగా పరిగణించబడును.

2.సర్వీసుని మిస్ చేసిన తప్పుగా నిర్ణయించబడును. .

3. బంతిని ఓవర్ హ్యాండ్ చేసిన తప్ప.

4. తప్ప కోర్టు నుండి సర్వీసు చేసిన తప్ప

5.సర్వీస్ తప్పు  కోర్టులోగాని, సెంటర్ లైన్ల మీదగాని, సర్వీస్ క్రీజ్లైను మీద పడిన అది తప్పగా పరిగణింతురు. .

6.క్రీడాకారులు తన వరుస క్రమము తప్పి సర్వీసు చేసిన తప్ప.

7. సర్వీసు చేయు క్రీడాకారుని యొక్క శరీరభాగములు లేక బ్యాట్ సెంటర్ లైన్ దాటిన యెడల తప్ప .

8 ఒకే క్రీడాకారుడు బంతిని ఒక్కసారికన్నాఎక్కువ సార్లు కొట్టిన తప్పదీనిని డబుల్టచ్ అని అంటారు. .

9. ఒక కోర్టులోని క్రీడాకారులు బంతిని ఒకేసారి రెండు బ్యాటులతో తాకిన తప్ప దీనిని టిప్ అని అంటారు.

10. ఆట జరుగు సమయంలో క్రీడాకారుని బ్యాట్, నెట్‌ని దాని వెళ్ళిన యెడల అది తప్ప
11. క్రీడాకారుల బ్యాట్లను బంతి కొట్టే సమయంలో కొట్టిన తరువాత ఒకదానికొకటి కొట్టుకొనిన తప్పు

12 బంతి క్రీడాకారుని దుస్తులను తగిలి, కోర్టు బయట లేక లోపల బడిన అది గుడ్ బాల్

13. బంతి కొట్టు సమయంలో బాట్, నెట్‌ని దాటిన లేక నెట్‌కు తగిన తప్పు

14. సర్వీసు సమయంలో బంతి శరీరమునకు తగిలిన యెడల అది తప్పు .

15. బాల్ బౌండరీ దాటి వెళ్ళిన తప్ప

మ్యాచ్ నిబంధనలు:

1. ఒక్కొక్క మ్యాచ్ మూడు గేమ్స్ కలిగియుండను. రెండు గేములు గెలిచినవారు విజేతలుగా నిర్ణయించబడును. ప్రతి గేమ్ తరువాత కోర్డులు మారవలయును. మొట్టమొదట ఎవరు 29 పాయింట్లు సంపాదిస్తారో ఆ టీముని విజేతగా నిర్ణయించబడును.

2.మొదటి గేమ్ ప్రారంభానికి ముందు టాస్ వేసి, టాస్ గెలిచిన వారు కోర్టుగాని లేక సర్వీసుగాని కోరుకొనవలెను. ప్రతి టీముకి 5 సర్వీసులు ఇవ్వబడును.

3. గేమ్ ప్రారంభించేముందు ఒక టైల్ బాల్‌ను అంపైర్ అనుమతించవచ్చును. తరువాత అంపైర్ ప్లే అని చెప్పి గేమ్‌ని మొదలు పెట్టవలెను.

4.ఒక అంపైర్, ఇద్దరు లైన్ రిఫరీలు మరియు ఒక స్కోరర్‌ను నియమించి గేమ్‌ని ఆడించవలెను.

5.అంపైర్ రెడీ అని చెప్పిన తరువాత ఏ టీము అయిన ఆట ఆడుటకు నిరాకరించిన వారు ఆ పందెమును పోగొట్టుకొనినట్టు పరిగణింతురు.

6.గేమ్ సక్రమంగా జరిపించుటకు, వాతావరణం, వెలుతురు సక్రమంగా ఉన్నది, లేనిదీ పరిశీలించవలసిన పూర్తి అధకారం అంపైర్‌కు కలదు. అంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం.
.
7. అనుకోని సంఘటనలు జరిగిన సమయంలో అంపైర్ లెట్ ఇచ్చను. .

8. తప్ప లేదా లెట్ తెలుపు బాధ్యత అంపైర్‌ది.

9.అంపైర్ పొరపాటున తప్పు అని నిర్ణయించిన తరువాత దానిని సరిచేసుకొనటకు లెట్‌ని అనుమతించవచ్చును.

10.. అంపైర్‌ని పోటీలు నిర్వహించు కమిటీ వారి అనుమతి లేనిదే మార్చకూడదు.
.
11లైన్ రిఫరీలు బంతి బౌండరీ లైన్ తాకినదా? లేదా? మరియు నెట్ రిఫరీ బంతిని నెట్‌ని తాకినదా
నిర్ణయించును.

12.. పాయింట్లను తప్పనిసరిగా నమోదు చేయవలయును. అందు కొరకు ఒక స్కోరర్‌ని నియమించాలి. రూల్ 14 లో చెప్పిన విధంగా కాకుండా గేమ్ ఆడకుండా ఏ మ్యాచ్ గెలిచినట్లు నిర్ణయించకూడదు.

 

Sharing is caring!