బాస్కెట్ బాల్

బాస్కెట్ బాల్ కొలతలు

బాస్కెట్ బాల్ చరిత్ర

బాస్కెట్ బాల్ అమెరికా సాంప్రదాయ క్రీడ. ఈ ఆటను డా. జేమ్స్ సైయిస్మిత్ 1891 సంవత్సరంలో కనుగొన్నారు. ఈయన అమెరికా దేశంలోని స్ప్రింగ్ ఫీల్డు కాలేజిలో వ్యాయామ అధ్యాపకుడుగా విధులను నిర్వహించేవారు. మొట్టమొదట ఈ ఆటను ఫుట్ బాల్‌తో జిమ్నాజియంలో ఆడేవారు. మొదట్లో చాలా తక్కువ నియమాలతో ప్రారంభించబడినది. 1892 సంవత్సరంలో ఈ ఆటకు నియమ నిబంధనలు రూపొందించారు. 1908 సంవత్సరం అమెరికన్ నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ స్థాపించబడింది. 1915, సంవత్సరంలో నియమ నిబంధనలు
క్రమబద్దంచేసి, ఆటను ప్రపంచ వ్యాప్తం చేశారు.
1904 సంవత్సరంలో బాస్కెట్ బాల్ అంతర్జాతీయ గేమ్‌గా గుర్తించబడినది. 1936 సంవత్సరంలో బాస్కెట్‌బాల్ ఆటను బెర్లిన్ ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టారు. ఈ ఒలిపింక్స్‌లో 21 దేశాలు ఒలింపిక్స్‌లో పాల్గొన్నాయి. 1948 సంవత్సరంలో లండన్‌లో నిర్వహించిన ఒలింపిక్స్‌లో 28 దేశాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం బాస్కెట్ బాల్ ఆటలో అమెరికా దేశం ఆధిపత్యం వహించుచున్నది.
ఇండియాలో 1930 సంవత్సరంలో YMCA కళాశాల ద్వారా ఈ ఆట ప్రవేశపెట్టబడెను. 1950 సంవత్సరంలో జాతీయ బాస్కెట్ బాల్ సమాఖ్య ఏర్పడింది. 1951 సంవత్సరంలో ఢిల్లీలో నిర్వహించిన ఆసియా క్రీడలలో ఇండియా మొట్టమొదట పాల్గొన్నది.

బాస్కెట్ బాల్ బ్లాక్ బోర్డ్ మరియు రింగ్ కొలతలు

రింగ్ నెట్ పొడవు 40cm

బోర్డుకి, రింగుకి మధ్య దూరం 15cm

రింగు మధ్య చుట్టుకొలత 45cm

నెట్‌కి ఉన్న లూప్‌ల సంఖ్య 12

రింగ్ కి నేలకి మధ్య దూరం 3.05m

నేలకి బోర్డుకి మధ్య దూరం 2.90m

బాస్కెట్ బాల్ బంతి కొలతలు

1. బంతి బరువు (సీనియర్స్) 567 నుండి 650 గ్రా.

2. బంతి బరువు (జూనియర్స్) 450 నుండి 500 గ్రా.

3. బంతి చుట్టుకొలత 75 నుండి 78 సెం.మీ.

బాస్కెట్ బాల్ మ్యాచ్ సమయం

1. మ్యాచ్ సమయం ప్రతి హాఫ్‌కి 20ని. చొప్పన 40 ని.

2. విరామ సమయం 15 నిమిషాలు

కొత్త రూలు ప్రకారం మొదటి క్వార్టర్‌కి 10 నిమిషాలు

రెండవ క్వార్టర్ 10 నిమిషాలు

ఒకటి, రెండు క్వార్టర్ల మధ్య విరామమం 2 నిమిషాలు

మూడవ క్వార్టర్‌కి 10 నిమిషాలు

నాల్గవ క్వార్టర్‌కి 10 నిమిషాలు

మూడు, నాల్గవ క్వార్టర్ల మధ్య విరామం 2 నిమిషాలు

బాస్కెట్ బాల్ కోర్టు కొలతలు

 

1. కోర్టు పొడవు 28 మీ.

2. కోర్టు వెడల్పు 15 మీ.

3. సెంటరు సర్కిల్ వ్యాసార్ధము 1.80 మీ

4. బౌండరీ లైన్ల మందము 5 సెం.మీ.

5. నేలపై నుండి బోర్డు ఎత్తు 2.90 మీ.

6. గ్రౌండునుండి రింగ్ వరకు ఎత్తు 3.05 మీ.

7. త్రీ పాయింట్స్ గోల్ ఏరియా వ్యాసార్ధము 6.75 మీ.

8. ప్లేయింగ్ కోర్టుకి టీము కూర్పున బెంచికి
మధ్యదూరం మరియు బౌండరీ లైను దూరం 2 మీ.

9. సెంటర్ లైను పొడగింపు 15 సెం.మీ.

10. ఫ్రీతో లైన్ల పొడవు 3.60m

 

బాస్కెట్ బాల్ బోర్డు కొలతలు

1. బోర్డు పొడవు 1.80 x 1.05 r

2. బోర్డు మందము 3 సెం.మీ.

3. బోర్డు లైన్ల మందము 5 సెం.మీ.

బాస్కెట్ బాల్ రింగు, నెట్ కొలతలు

 

1. రింగ్ మందము 1.60 సెం.మీ. నుండి 2 సెం.మీ.
Basket Ball Skills
జంప్ బాల్

జంప్ బాల్ సమయంలో రెండు టీముల యొక్క ఇద్దరు ఆటగాళ్ళు వారి పాదములను సెంటర్ సర్కిల్ లైనుకు దగ్గరగా ఉంచవలెను. విరామ సమయం తరువాత కూడా ఆట ప్రారంభించే ముందు జంప్ బాల్ ద్వారా ఆట మొదలు పెట్టబడును. బంతిని రెండుసార్లు మాత్రమే తాకవచ్చును. జంప్లాల్ సమయంలో నింబధనలు అతిక్రమిస్తే జరిగిన దానికి శిక్షణ విధిస్తారు. ఇవ్వబడుతుంది. ప్రత్యర్ధిచే సైడ్‌లైన్ నుండి బంతి కోర్టు లోపలికి త్రో చేయిస్తారు.
Thrown-In:

నియమాలను అతిక్రమించిన సందర్భంలో బంతి డెడ్‌బాల్ అవుతుంది. సైడ్ లైన్‌కు దగ్గరలో ఒకచోట నుంచి బంతిని లోపలికి వేయుటకు ప్రత్యర్థి జట్టుకు అవకాశం వస్తుంది. బంతిని విసిరివేయుచున్న ఆటగాడు లైనుని తాకుటకు అనుమతింపబడును. అది నియమ అతిక్రమణ క్రిందకు రాదు. 5 సెకండ్ల లోపల బంతిని కోర్టులోకి పంపవలెను.
Free Throw:

ఫౌల్ ఏ ఆటగాడిపైన జరుగుతుందో ఆ ఆటగానికి ఫ్రీ త్రో ఇవ్వబడుతుంది. కాని టెక్నికల్ ఫౌల్‌లో ఏ ఆటగాడైనా ఫ్రీతో చేయవచ్చును. ఆటగాడు ఫ్రీతో ప్రయత్నిస్తున్నపుడు మిగిలిన ఆటగాళ్ళు ఈ క్రింది సూచించిన స్థానాలలో ఉండాలి.
1. ప్రత్యర్థి జట్టుకు చెందిన ఆటగాళ్ళు ఇద్దరు బాస్కెట్ వద్ద నిలబడి ఉండాలి. 2. మిగతావారు ఆల్టర్నేటివ్ పొజిషన్స్‌లో ఉంటారు.
3. మిగిలిన ఆటగాళ్ళు ఫ్రీత్రోకు భంగము కలిగించకుండా ఏ స్థలములోనైనా ఉండవచ్చును.

Sharing is caring!