క్రికెట్‌ను ఒలంపిక్స్ లో ప్రవేశపెట్టాలని మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ!

 

క్రికెట్‌ను ఒలంపిక్స్ లో ప్రవేశపెట్టాలని మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయ కానీ దీనికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు కనబడడం లేదు .
చివరిసారిగా 1900 సంవత్సరంలో ప్యారిస్ లో జరిగిన ఒలంపిక్స్ లో క్రికెట్ ఆట ఆడారు. ఆ ఒలింపిక్స్ లో రెండు teams క్రికెట్ ఆట ఆడినాయి .అవి ఫ్రాన్స్ మరియు బ్రిటన్ రెండు రోజుల పాటు జరిగిన ఈ ఆటలో 158 పరుగుల తేడా తో బ్రిటన్ గెలిచింది.
అప్పటి నుండి ఇప్పటివరకు . ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చలేదు.
దానికి కారణం లేక పోలేదు క్రికెట్ ను 6 రోజుల పాటు ఆడాల్సి వస్తుంది.16 రోజు లు జరిగే ఒలింపిక్స్ లో అంత సమయం ఇవ్వడం సాధ్యపడదు. అయితే ఇప్పుడు .
T20 format క్రికెట్‌ను 2024 లో జరిగే ఒలంపిక్స్‌లో లో ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. సాధారణంగా ఒలింపిక్స్ ను నిర్వహించే దేశానికి 5 ఆటలను జాబితాలో చేర్చే అవకాశం ఉంది.కావున 2024 ఒలింపిక్స్ పారిస్ లో జరుగుతుండటం తో మళ్ళీ క్రికెట్ ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు
అయితే అన్ని దేశాల ప్రధాన జట్లు ప్రధాన ఆటగాళ్లు పాల్గొంటారని. గ్యారెంటీ ఇస్తే క్రికెట్‌ను పరిశీలిస్తామని అంతర్జాతీయ ఒలంపిక్ కౌన్సిల్ ఐసీసీ కి తెలిపింది.
ఐసీసీ భారత క్రికెట్ బోర్డ్ అంగీకారం కోసం చూస్తుంది.బీసీసీఐ ని కాదని ఐసీసీ ముందుకు వెళ్ల లేదు.
ఇక క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చడం వలన క్రికెట్ చాలా మంచిది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.కానీ క్రికెట్ ను ఒలింపిక్స్ లో కలపడం వల్ల బిసిసిఐ ఇండియన్ ఒలింపిక్ ఆసోసియేషన్ క్రిందికి వెళ్లాల్సి ఉంటుంది .ఇది తమ అస్థిత్వాన్ని దెబ్బతీస్తుంది అని బీసీసీఐ భావిస్తుంది.తన అస్తిత్వం విషయం లో బిసిసిఐ చాల జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తుంది.క్రికెట్ ఆటగాళ్ల పైన nada ను డో ప్ టెస్ట్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదు.తానే స్వయంగా డోప్ టెస్ట్ నిర్వహించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *