నేను చనిపోతే ప్రపంచం మొత్తం ఏడుస్తుంది, కానీ భారత దేశం లో ఒక్క కన్నీటి బొట్టు కూడ రాల్చరు .భారత దేశం లో హాకీ కథ ముగిసింది.ధ్యాన్ చాంద్ జీవిత చరమాంకం లో అనరోగ్యానికి గురై మరణించారు , ధ్యాన్ చాంద్ ను హాకీ సమాఖ్య గాని భారత పభుత్వం గాని ఏమాత్రం పట్టించుకొలేదు అతను చనిపోయే రెండు నెలల ముందు ఏమని చెప్పారంటే “నేను చనిపోతే ప్రపంచం మొత్తం ఏడుస్తుంది, కానీ భారత దేశం లో ఒక్క కన్నీటి బొట్టు కూడ రాల్చరు” అది నాకు తెలుసు అన్నారు .దీన్ని బట్టి ద్యాంచంద్ గారు ఎంత బాధ పడ్డారో అర్ధం అవుతుంది ప్రపంచం మొత్తాన్ని తన ఆటతో ఆకట్టుకొని లక్షల అభిమానులను సంపాదించిన ‘చాంద్’ భారత లో మాత్రం నిరాదరణకు గురైయారు . అతను ఎప్పుడు ఒక్క మాట చెప్తుండే వాడు ” భారత దేశం లో హాకీ కథ ముగిసింది ఆటగాళ్లలో అంకితభావం లేదు, గెలవాలనే తపన లేదు ” అని అతను చనిపోవటానికి సరిగ్గా ఆరు నెలల ముందు అతని స్నేహితుడు పండిత్ వైద్యనాథ్ శర్మ ద్యాన్ చాంద్ ను యూరోప్ లో హాకీ అభిమానులకు పరిచయం చేయాలని ప్రపంచ టూర్ కు సన్నాహాలు చేశాడు . ఈ టూర్ ద్వారా ప్రజల జ్ఞాపకాల లో ద్యాన్ చాంద్ ను గుర్తుచేయాలనుకున్నారు , ప్లేన్ టికెట్స్ కూడా తీసుకోవడం జరిగింది.కాని ధ్యాన్ చాంద్ వెళ్లే పరిస్థితి లో లేడు . చంద్ ను వేరే దేశము లో. చికిత్స చేయిస్తాం అని తన స్నేహితులు చెప్పారు .కానీ ధ్యాన్ చాంద్. నేను ఈ ప్రపంచం మొత్తం చూశాను అని చెప్పి వెళ్ళడానికి నిరాకరించాడు .1979 ద్యాన్ ఆ రోగ్యం క్షీణించడం తో అతన్ని జాన్సీ నుండి ఢిల్లీ కి తీసుకొని వచ్చారు . హాస్పటల్లో మరణం తో పోరాడుతూ తన కుటుంబ సబ్యులతో ద్యాన్ ఏమిచెప్పాడు అంటే , ఇంట్లో తన రూమ్ లో వున్నా. మెడల్స్ ను జాగ్రత్తగా చూడమని చెప్పాడు . ఎందుకంటే గతంలో తన రూమ్ నుండి కొన్ని మెడల్స్ ఎవరో ఎత్తుకు పోయారు .ఒక సారి ఝాన్సీ ఎగ్జిబిషన్ లో తన ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఎవరో ఎత్తుకు పోయారు .తనకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఇండియా హాకీ పరిస్థితి ఏంటి అని అడిగాడు . దానికి ధ్యాన్ ఇండియా లో హాకీ కథ ముగిసింది అని చెప్పి కోమాలోకి వెళ్ళాడు . అల కోమాలోకి వెళ్లిన కొన్ని గంటల్లో మరణించాడు
