ధ్యాన్ చంద్

ధ్యాన్ చంద్ సింగ్ ఆగష్టు 29, 1905లో ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్, అలహాబాద్ లో రాజపుత్ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి సామేశ్వర్ దత్ సింగ్ భారతీయ సైన్యంలో పనిచేశారు

చంద్ కి ఇద్దరు సోదరులు – మూల్ సింగ్, మరియు రూప్ సింగ్ .
అతని తండ్రి యొక్క వృత్తి పరమైన బదిలీల వలన వారి కుటుంబం వివిధ నగరాలకు మారవలసి వచ్చింది మరియు దాని వల్ల సింగ్ సరిగా చదవలేకపోయాడు. ఆరవ తరగతి తరువాత అతను తన చదువుకు స్వస్తి చెప్పాడు. చివరికి వారి కుటుంబం ఝాన్సీలో స్థిరపడింది.
చదువుకొనే రోజుల నుండి ధ్యాన్ చంద్ కి హాకీ ఆడటం అంటే ఇష్టం మరియు ఝాన్సీలోని హీరోస్ క్లబ్ లో అతను ఒక చురుకైన సభ్యుడు. ఆ రోజులలో భారతదేశంలో ఉన్న ప్రముఖ హాకీ క్లబ్ లలో ఇది కూడా ఒకటి. జట్టు సభ్యులందరూ చక్కగా ఆడి ఎన్నో జాతీయ టోర్నమెంట్స్ లో విజయం సాధించారు.
1922లో తన 16వ ఏట చంద్ భారత సైన్యంలో చేరాడు. సుబేదార్-మేజర్ బాలే తివారి అతని క్రీడా నైపుణ్యాలను గమనించాడు. ఆటపై లోతైన అవగాహన కలిగిన తివారి చంద్ యొక్క ప్రతిభను గుర్తించాడు. ఆయన, అతనికి సలహాదారుగా మారి, అతని క్రీడా జీవితానికి పునాది వేశాడు.
1922 మరియు 1926ల మధ్య చంద్ ప్రత్యేకించి సైన్యపు హాకీ పోటీలలో మరియు సైనికదళ క్రీడలు ఆడాడు. తుదకు చంద్ న్యూజిలాండ్ టూర్ కి వెళ్ళీ, భారత సైన్య హాకీ జట్టుకు ఎంపిక కాబడినాడు. ఆ జట్టు 18 మ్యాచ్ లలో నెగ్గి రెండింటిని డ్రా చేసి, ఒకటి మాత్రమే ఓడిపోయి, ప్రేక్షకుల ప్రశంసలను పొందింది. తరువాత న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో మొదటి దానిలో నెగ్గి, రెండవది కొంచెంలో ఓడిపోయింది. భారత్ తిరిగి వచ్చిన వెంటనే చంద్ లాన్స్ నాయిక్ గా పదోన్నతి పొందాడు.

1928 ఆమ్స్టర్ డాం వేసవి ఒలంపిక్స్ లో భారత జట్టు మే 26న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఆతిధ్య జట్టు నెదర్లాండ్స్ తో తలపడింది. ఆమ్స్టర్ డాం వేసవి ఒలంపిక్స్ లో 5 మ్యాచ్ లలో 14 గోల్స్ చేసి, చంద్ టోర్నమెంట్ లో ఎక్కువ గోల్స్ సాధించినవాడిగా నిలిచాడు

భారత్ యొక్క ఈ విజయాన్ని గురించి చెబుతూ ఒక వార్తాపత్రిక ఇలా అంది,

ఇది హాకీ ఆట కానే కాదు, ఇది ఒక మాయ. నిజానికి ధ్యాన్ చంద్ ఒక హాకీ మాంత్రికుడు.

1932 లాస్ ఏంజెల్స్ వేసవి ఒలంపిక్స్

1932 ఒలంపిక్స్ ఫైనల్స్ లో భారత్ USA ను 24-1 తో ఓడించి, ప్రపంచ రికార్డు ని నెలకొల్పింది

1936 బెర్లిన్ ఒలంపిక్స్ లో ఇండియన్ హాకీ కాప్టైన్ గ ధ్యాన్ చంద్ నియమించ బడ్డాడు

1936 ఒలంపిక్స్ హాకీ ఫైనల్ లో ధ్యాన్ చంద్ జర్మనీ పై ఒక గోల్ చేసాడు

1956లో 51 వ సంవత్సరాల వయస్సులో, అతను సైన్యంలో మేజర్ హోదాలో పదవి విరమణ చేశాడు. ఆ సంవత్సరంలోనే భారత ప్రభుత్వము అతనిని పద్మ భూషణ్ (భారత దేశం లో 3 వ గొప్ప పౌర పురస్కారం) తో సత్కరించింది. ఈ రోజు వరకు పద్మ భూషణ్ ను పొందిన ఏకైక హాకీ ఆటగాడిగా అతను మిగిలిపోయాడు.

పదవీ విరమణ తరువాత, అతను మౌంట్ ఆబు, రాజస్థాన్ లో శిక్షణ శిబిరాలలో శిక్షణ ఇచ్చే వాడు. తరువాత, అతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, పాటియాలాలో చీఫ్ హాకీ కోచ్ గా వ్యవహరించారు, చాలా సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. చంద్ అతని చివరి రోజులను స్వగ్రామం ఝాన్సీలో గడిపాడు.

ధ్యాన్ చంద్ డిసెంబర్ 3, 1979 న ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు మరణించాడు.

  • మేజర్ ధ్యాన్ చంద్ ఒక హాకి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. చాలా సార్లు మిస్ అయిన తర్వాత, గోల్ పోస్ట్ యొక్క కొలత గురించి అతను మ్యాచ్ రిఫరీతో వాదించాడు, మరియు అద్భుతంగా, అది ఒక గోల్ పోస్ట్ యొక్క అధికారిక వెడల్పుకు (అంతజాతీయ నియమముల క్రింద నిర్దేశించబడింది) సరిపడినట్లుగా లేదని కనుగొన్నారు.[5]
  • 1936 బెర్లిన్ ఒలంపిక్స్ లో అతని ఫలోత్పాదమైన ఆటను వీక్షించిన తర్వాత అడాల్ఫ్ హిట్లర్ ధ్యాన్ చంద్ కు, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో మేజర్ పదవిని, జర్మన్ పౌరసత్వాన్ని మరియు అతనిని కల్నల్ హోదాకు పంపే ఆఫర్ ను అందించాడు (ధ్యాన్ చంద్ తరువాత దానిని తిరస్కరించాడు).[5]
  • టోక్యో ఒలంపిక్స్ అధికారులు ఇతని హాకీ స్టిక్ ని విరిచి దానిలో అయస్కాంతం ఉన్నదేమో అని చూశారు. ఆశ్చర్యకరంగా దానిలో ఏమీ కనుగొనలేకపోయారు, చివరకు ఇది జిగురు యొక్క ఫలితమని తెలిపారు.[

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *