ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త

FIFA… ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త. ఒకప్పుడు ఫుట్బాల్ ప్రపంచ కప్పు సమరాన్ని చూడడానికి నాలుగు సంవత్సరాలు ఎదురుచూడాల్సి ఉండేది. ఇకమీదట నాలుగు సంవత్సరాలు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. సాకర్ చరిత్రలో కీలక నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రతిపాదనలు జరుగుతున్నాయి. నాలుగు సంవత్సరాలకోసారి ప్రపంచ కప్పు పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా mini సాకర్ వరల్డ్ కప్ నిర్వహించాలని ఫిఫా ప్రతిపాదనలను చేసింది. ఇది ప్రతి రెండు సంవత్సరాలకోసారి నిర్వహించాలని అనుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆటలలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి ఒకప్పుడు ఫుట్బాల్ ప్రపంచ కప్ లో 32 దేశాలు పాల్గొనేది ప్రస్తుతం దానిని 48 దేశాలకు అవకాశం లభించింది. ఇప్పుడు ప్రపంచ ఫుట్బాల్ mini కప్పును ప్రవేశపెట్టడం ఫుట్బాల్ అభిమానులకు సంతోషకరమైన విషయం .దీనిపైన ఇతర విషయాలు తర్వాత వెల్లడిస్తామని ఫిఫా అధికారులు వివరించారు

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *