హాకీ

                                       హాకీకొలతలు 

హాకీ చరిత్ర


పూర్వం కాలంలో హాకీ ఆట ఐరోపా దేశంలో ఆడేవారికి ప్రతీతి.  ఆధునిక హాకీ జన్మస్థలం ఇంగ్లండ్ దేశమని పేర్కొనాలి. 1838 సంవత్సరంలో తొలుత ఈ ఆటను హాకీ అనే పేరుతో పిలిచారు.
1875 సంవత్సరంలో హాకీ ఆటకు నియమ నిబంధనలు అజమాయిషీ చేయుటకు ఒక సంఘము ఏర్పడినది. 1900 సంవత్సరంలో తొలిసారిగా హాకీ ఆటను ఒలింపిక్స్‌లో చేర్చారు.

  1924 సంవత్సరంలో వివిధ దేశాల హాకీ ఆట అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమై అంతర్జాతీయ హాకీ సమాఖ్యను స్థాపించారు. ప్రతినిధులు సమావేశంలో హాకీ ఆటను ఒకే రీతిలో ఆడుట కొరకు IHF ఆధ్వర్యంలో /కొన్ని నియమ నిబంధనలను రూపొందించారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య కృషి ఫలితంగా 1928 సంవత్సరం నుండి హాకీ ఒలింపిక్స్‌లో చేర్చారు.

1928 సంవత్సరంలో ఒలింపిక్స్‌లో భారతదేశం హాకీలో పాల్గొని బంగారు పతకాన్ని గెల్చుకున్నది.
   హాకీ ఆటలో ఇండియాలో 1885 సంవత్సరంలో ప్రారంభించబడినట్లు తెలియుచున్నది. అయితే అప్పట్లో హాకీ ఆట ‘ఖడో-ఖడ్ అని పిలచేవారు. కాలక్రమేణా ఈ ఆట దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా వ్యాప్తి చెందింది.

1925 సంవత్సరంలో భారత హాకీ సమాఖ్య ఏర్పడింది. 1928 సంవత్సరంలో భారతదేశం ఒలింపిక్స్‌లో పాల్గొని బంగారు పథకాన్ని గెల్చుకున్నది. బంగారు పతకం ఇండియా గెలవడంతో ఈ ఆటప విపరీతమైన ఆసక్తి ప్రజల్లో కలిగింది. తరువాత 1928 నుండి 1956 సంవత్సరం వరకు ఇండియా ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు గెల్చుకొన్నది.

 

 హాకీ ఫీల్డ్కొలతలుహాకీ కోర్ట్
హాకీ

1. హాకీ ఫీల్డ్ పొడవు                                       91.40 మీ.

2. హాకీ ఫీల్డ్ వెడల్పు                                          55 మీ.

3. గోల్ స్తంబాల నుండి పెనాల్టీ కార్నర్స్ 4.55 మీ మరియు 9.10 మీ.

4. పెనాల్టీ స్పాట్ మార్కింగ్                       6.40 మీ.

5. పెనాల్టీ స్పాట్ చుట్టుకొలత             15 సెం.మీ.

6. షూటింగ్ సర్కిల్ దూరం                      14.63 మీ.

7. లైన్స్ వెడల్పు                                            75 మి.మీ.

హాకీబంతి, స్టిక్ కొలతలు

1.బంతిబరువు                            156 నుండి 163 గ్రాములు

2 బంతి చుట్టుకొలత                224 నుండి 235 మి.మీ.

3. హాకీస్టిక్ బరువు                          737 గ్రాములు

4. హాకీ స్టిక్ రింగ్ వ్యాసం              51 మి.మీ.
హాకీగోల్పోపోస్టులబోర్డు కొలతలు


1.గోల్‌పోస్టుకు, సైడ్ బోర్డ్స్ పొడవు, మందము      1.20మీ. x 460 మి.మీ.
2.గోల్‌పోస్టుకు, బాక్ బోర్డ్స్ పొడవు, మందము        3.66 మీ. x 460 మి.మీ.3.పోస్టు ఎత్తు                                                                          2.13మీ.

4.రెండు పోస్టుల మధ్య దూరం                                  3.66మీ
5.పోస్టుల క్రాస్ బార్ వెడల్పు, మందము.     51 x 75మి.మీ.
6.కార్నర్ ఫ్లాగ్స్ సంఖ్య                                                4
7.కార్నర& ఫ్లాగ్ ఎత్తు                                                       1.20నుండి 1.50 మీ.8.కార్నర్ ప్లాగ్ పొడవు,
 8.  వెడల్పు                                                                              300 మీ.మీ

హాకీ క్రీడాకారులసంఖ్య

1. ప్రతి టీములోని క్రీడాకారుల సంఖ్య          16

2. ప్రతి మ్యాచ్‌లోని క్రీడాకారుల సంఖ్య              11

3. సబ్స్టిట్యూట్స్ సంఖ్య                                         5

4. మ్యాచ్ సబ్స్టిట్యూట్స్ సంఖ్య                         ౩

 

హాకీఆటసమయం


1. గేము నిర్వహణ సమయం                   70min (35+35)2. మ్యాచ్‌కి విరామం                                     5 or 10min3. అధికారుల సంఖ్య                                   4హాకీ చాతుర్యములు (Skills)

1.HoldStick, 2. Scooping, 3. Penalty Kick 4.. Attacking,
5.Hitting, 6. Push-In. 7. Tackle, 8, Penalty Corner, 9. Goal Keeping,
10.Stopping,11.Dribbling, 12. Flicking, 13. Scoring, 14. Bully
15. Pushpass, 16. Lunge, 17. Scoring,

 

హాకీ గేమ్, మ్యాచ్ నియమ నిబంధనలు

 ఆటగాడు స్టిక్ అవతలి వైపుతో బంతిని ఆడకూడదు. బల్లపరుపుగా ఉన్న వైపునే ఆటకు ఉపయోగించాలి.
గేమ్, మ్యాచ్ నియమ నిబంధనలు: 1. ఆటగాడు స్టిక్ అవతలి వైపుతో బంతిని ఆడకూడదు. బల్లపరుపుగా ఉన్న వైపునే ఆటకు ఉపయోగించాలి. ఏ ఆటగాడు గాని తన సొంత స్టిక్ లేకుండా ఆటలోకి రాకూడదు. స్టోక్ ముందుగాని, తరువాతగాని స్టిక్ భుజము పైకి పోవచ్చును.
                  కాని బంతి ప్రమాదకరంగా ఏ అపాయాన్ని క్రీడాకారులకు కలిగించరాదు. అపాయం కలిగించేటట్లు, ప్రత్యర్థి బంతిని దారుణంగా కొట్టడం నిషేదించబడును. ఆటగాడు తన శరీర భాగంలో దేనితోనైనా, చేతిలోనైనా కూడా తనకు గాని తన జట్టుకు కాని లాభం కలిగేటట్లు అతను బంతిని నేలపైగాని గాలిలోగాని ఆపటం మరల్చటం చేయరాదు. ఏ ఆటగాడు అయిన బంతిని కొట్టేటప్పుడు, స్టిక్‌తో గాకుండా తన కాళ్ళను ఉపయోగించరాదు.
                   ఆటగాడు స్టిక్‌తో తప్ప, ఇతరత్రా బంతిని పైకెత్తటం, కొట్టటం, విసరటం లేదా ఏ విధంగానైనా బంతి దిశ మారేటట్లు త్రిప్పటం చేయరాదు. ప్రత్యర్థి స్టిక్‌తో హిట్ చేయుట, హుక్చేయుట, Strikingచేయుట తప్పకాదు. ఆటగాడు ప్రత్యర్ధిని స్టిక్‌తో ఆటంకపరచరాదు.
                   గోల్‌కీపర్ వలయంలో బంతి ఉన్నప్పుడు బంతిని తన శరీర భాగంలో దేనితోనైనా కొట్టవచ్చు, ఆడవచ్చు, బంతి గోల్కీపరు పాడ్స్‌లో పడినగాని, ఏ ఆటగాని దుస్తుల్లో పడినగాని ఆట ఆపవేయబడుతుంది. ఇది ఏ చోట జరిగిందో ఆ చోటునుంచే ఆటను మరలా రిఫరీ మొదలు పెడతారు. బంతి రిఫరీని తగిలినా ఆట జరుగుతూనే ఉంటుంది. 10. అపాయకరమైన ఆట, అనుచిత ప్రవర్తన లేదా కాలహరణ చేయటం అనుమతించబడదు. 


హాకీ
Corner

 

కార్నర్ ఫ్లాగ్ పోస్ట్‌కు 4.55 మీ. దూరంలో ఉన్న సర్కిల్లో, గోల్‌లైన్ వద్దగాని, సైడ్‌లైన్ వద్దగానిattacking teams, Free Hits:ఇవ్వబడుతుంది


హాకీ
Penalty Stroke

 

డిపెండింగ్ టీమ్‌చే సర్కిల్లో బుద్ధిపూర్వకంగా ఫౌల్ చేయబడినపుడుattacking teamకు పెనాల్టీ స్టోక్ ఇవ్వబడుతుంది. కార్నర్ హిట్ సమయంలో ఉభయ పక్షముల ఆటగాళ్ళు వారికి ఇష్టమైన చోట నిలబడవచ్చు.
నూతన నియమాలననుసరించి అటాకర్ని ఎదుర్కొనే జట్టు ఏదైనా తప్పిదము బుద్ధిపూర్వకంగా జరిగినా, యాదృశ్చికంగా జరిగినా ఆ జట్టుకు పెనాల్టీ స్టోక్ ఇవ్వబడుతుంది. పెనాల్టీ స్టోక్ అంటే అఫెండింగ్ జట్టు ఆటగాడు గోల్ఫ్లైన్ ముందు 6.40 మీ. దూరం నుంచి బంతిని హిట్ చేయటం, అయితే గోల్ కీపర్‌కు సంబంధించిన నియమాలు అతనిపై పూర్తిగా అనుసరింపబడతాయి.

 

హాకీ అధికారుల విధులు 

హాకీ ఆటలో ఇద్దరు అంపైర్లు, ఒక స్కోరర్ మరియు ఒక టైమ్ కీపర్ ఉంటారు.
హాకీ అంపైర్ విధులు
1 . ప్రతి అంపైర్ ఆట స్థలంలో తన భాగంలో నిర్ణయాలు తీసుకొనును.

Sharing is caring!