జావెలిన్

                                               జావెలిన్ త్రో 
              
                                       
 జావెలిన్  చాతుర్యములు
 1)Grip 2)Carry 3) Run 4) Gross Step 5) Impulse Strides 6) Release
 
 జావెలిన్ పట్టుకొను గ్రిప్ మూడు రకములు
 
 1 బొటనవేలు మరియు మొదటి వేలు గ్రిప్, దీనిని అమెరికన్ గ్రిప్ అని అందురు
 
 2. బొటనవేలు మరియు రెండవ వేలు గ్రిప్ దీనిని ఫినిష్ గ్రిప్ అని అందురు. 
 
3. మొదటి వేలు మరియు రెండవ వేలు గ్రిప్.
 జావెలిన్ భాగములు
 1) MetalHead 2) Shaft 3) CordGrip
జావెలిన్ త్రో 
జావెలిన్ త్రో

 

కొలతలు

1.రన్వే పొడవు 30 మీ

.
2.రన్వే వెడల్పు 4 మీ.

3.జావెలిన్ పొడవు (పురుషులు)      2.60 నుండి 2.70 మీ.

4.జావెలిన్ పొడవు (స్త్రీలకు)              2.20 నుండి 2.30 మీ.

5.జావెలిన్ కార్డు గ్రిప్ (పురుషులు)                       15 మి.మీ.

6. జావెలిన్ కార్డు గ్రిప్ (స్త్రీలకు)                           14 మి.మీ.

7.జావెలిన్ మెటల్ హెడ్ పొడవు (పు మరియు స్త్రీ) 250 నుండి 330 మీ.

8. జావెలిన్ మెటల్ హెడ్ వెడల్పు                                 150 నుండి 160 మి.మీ.

9.జావెలిన్ యొక్క చుట్టుకొలత (పు)                                 25 – 30 మి.మీ.

10. జావెలిన్ యొక్క చుట్టుకొలత (స్త్రీ)                          20 – 25 మి.మీ.

11. మెటల్ హెడ్ బరువు 80 గ్రాములు

జావెలిన్ బరువు

పురుషులు                                             800 గ్రాములు

స్త్రీలకు                                                   600 గ్రాములు

 

                         
  జావెలిన్ త్రో నిర్మాణం
 ఈ జావెలిన్ త్రోకి 30 మీ. నుండి 36.50 మీ. వరకు రన్వే ఉండవలయును. రన్వే వెడల్పు 4 మీ. గలిగిన 2 సమాన గీతలు గీయవలయును. A.Bమీదుగా ఒక తాడును రన్వే మార్గానికి ఎదురుగా కట్టవలయును. తరువాత C, D అను బిందువులను ఈ తాడు మీద గుర్తించుము. C, D ల నుండి త్రాడుకి ఎదురుగా రెండు సమాంతర గీతలు గీయవలయును. 8 మీ. రేడియస్తో CD నుండి సమాంతర గీతల మధ్య రెండు ఆర్క్లను గీయవలయును. అది ‘0’ బిందువుగా గుర్తంచవలెను. ‘0’ని సెంటర్గా తీసుకొని CDలను కలుపుచూ ఒక ఆర్క్ గీయవలయును. తరువాత 1.50 మీ. పొడవు 7 సెం.మీ. వెడల్పు గల గీతలు CDల నుండి గీయవలయును. ‘0’ నుండి C, D ల నుంచి సెక్టర్ లైన్ గీయవలయును. లైను మందం 5 సెం.మీ. వుండవలెను. తరువాత బిందువుల దగ్గరున్న మేకులను తీసివేయవలెను. ఈ విధంగా జావెలిన్ త్రో నిర్మించబడును.
 
నిబంధనలు 
 1.జావెలిన్ విసిరేటప్పుడు చేతికి ఏ విధమైన టేప్ని లేదా గౌజ్ని ధరించకూడదు.
 2. ఏదైన గాయమైనప్పుడు తప్ప, ఏ విధమైన కట్లుగాని, చేతిమీద ఉండకూడదు.
 3. జావెలిన్ పట్టుకొనుటకు రెసిన్ లాంటి పదార్ధములు వాడవచ్చును. o
 4. జావెలిన్ గ్రిప్ని పట్టుకొని విసరవలెను. 
 5.జావెలిన్ భుజముపైన నుంచి విసరవలెను.
 6.జావెలిన్ చివరనున్న ఇనుప మొన (మెటల్ హెడ్) భూమికి తగిలినప్పుడు మాత్రమే విసిరిన దూరపు కొలతను పరిగణనలోనికి తీసుకొందురు.
 
7.జావెలిన్ విసిరేటప్పుడు పరుగెత్తే ప్రదేశమునకు ఇరువైపుల ఉన్న సమాంతర గీతలనుగాని లేక స్టిప్ను గాని తాకకూడదు. అట్లా తాకిన ఎడల అది తప్పుగా పరిగణించబడును.
 8.జావెలిన్ భూమి మీద పడేవరకు పోటీదారుడు గరుగెత్తు ప్రదేశమును వదలరాదు.
 9.పోటీదారుడు అన్ని నిబంధనలను పాటించి జావెలిన్ విసరగా, ఒకవేళ జావెలిన్ మధ్యలో
విరిగితే మరొక అవకాశము పోటీదారునికి ఇవ్వబడును.
 10. పరుగెత్తే ప్రదేశంలో ఎటువంటి గుర్తులు పోటీదారుడు ఉంచరాదు. అవసరమైతే సమాంతర
గీతల ప్రక్కన కావలసిన గుర్తులు ఉంచుకొనవచ్చును.
జావెలిన్ 20 డిగ్రీల నుండి 32 డిగ్రీల యాంగిల్లో త్రో చేయవలెను. 

 

Sharing is caring!