నాణ్యమయిన జీవితానికి వ్యాయామ విద్య తోడ్పాటు

నాణ్యమయిన జీవితానికి వ్యాయామ విద్య తోడ్పాటు

నాణ్యమయిన జీవితానికి  వ్యాయామ విద్య తోడ్పాటు 

నాణ్యమయిన  జీవితం అంటే  ఏమిటి ?
సంతోషం,ఆరోగ్యం, శారీరక దృఢత్వం ,వినోదం, అని కొంత మంది భావించారు .
మరికొంత మంది  ఎలాంటి జబ్బులు రాక  పోవడం ,విశ్రాంత సమయం, అణిచివేతనుండి విముక్తి ,ప్రమాదం నుండి రక్షణ ,అని కొంత మంది వివరించారు .
ఈరోజు ల్లో  నాణ్యమయిన జీవితం అంటే దీర్ఘ కాళికా మరియు ఆరోగ్య వంతమయిన  జీవితం .    ఇక్కడ దీర్ఘ కాలిక మరియు ఆరోగ్య వంతమయిన  జీవితం  అనే దాంట్లో   శ్రేయస్సు మరియు శారీరక  దృఢత్వం  అనే విషయాలు  దాగివున్నాయి .

ఈమధ్య అందరిలో ఒక భావన  కలుగుతుంది  శారీరకంగా  దృడంగా ఉండాలి లేక పోతే కనీసం దృడంగా అయినా కనిపించాలి అని . ఈ  భావన  చాలామంది లో కల్గుతుంది .
వీటి ఫలితంగా  అధికారులు   తమ కంపెనీలలో  వ్యాయామ విద్య కార్యక్రమాలు  ఉండేలా చూసుకుంటున్నారు .
అలాగే  ఉద్యాగాలు  ఇచ్చే ముందు  ఉద్యోగస్తుల  ఆరోగ్య  శారీరక  దృఢత్వాన్ని కూడా  పరిశీలిస్తున్నారు .

కుటుంబాలు  తమ  విశ్రాంత  సమయాలలో  మరియు వేడుకలలో  వినోదభరితమయిన  మరియు  స్పోర్ట్స్    సంబందించిన  అంశాలపై  ద్రుష్టి పెడుతున్నారు
వేలకొద్దీ ప్రజలు మారథాన్ వంటి పోటీలలో  పాల్గొంటున్నారు .
ఇప్పుడు అన్ని వయసుల వారికి  నడక  ఒక మంచి  వ్యాయామముగా  మారిపోయింది

హెల్త్  సెంటర్స్,ఏరోబిక్స్  సెంటర్స్ ,టెన్నిస్ ,స్విమ్మింగ్  వంటివి  ఆరోగ్యం పట్ల క్రీడల పట్ల మక్కువ  వున్నవారికోసం  వెలుస్తున్నాయి
గుండె జబ్బులు వంటివి  వ్యాయమ విద్య  ప్రాధాన్యతను   తెలుపు తున్నాయి .
సరిగా లేని  ఆహారపు  అలవాట్లు చాలా మందిని  అనారోగ్యం పాలుచేస్తున్నాయి ,
ఇప్పుడు ప్రజల  అభిప్రాయం  లో మెరుపు వచ్చింది , చాలాకాలం జీవించడమే  కాకుండా మిగిలిన జీవితాన్ని  ఆనందంగా  గడపాలి  అనుకుంటున్నారు .
పెరుగుతున్న సాంకేతిక  పరిజ్ఞానం మనరోజువారి జీవితం లో   వ్యాయామం లేకుండా చేస్తుంది
చాలామంది  వ్యాయమ కార్యక్రమంలో  పాల్గొన లేక పోతున్నారు
దానికి క్రింది కారణాలు  వున్నాయి
1)ప్రేరణ  2)సమయం 3)ఆర్థికవిశయాలు 4) చాతుర్యములు 5) పరిజ్ఞానం
మొదలగునవి  లేక పోవడం
50% కన్నా తక్కువ ప్రజలు  వ్యాయామ కార్యక్రమాలలో  పాల్గొంటున్నారు , కావున మిగితా వాళ్ళను ప్రోత్సహించాల్సిన  బాధ్యత  వ్యాయామ బోధకుల  పైన వుంది .
పాఠశాలలో గాని రిక్రియేషన్  వంటి సంస్థలలో  కేవలం  చాతుర్యములు  కలిగినటువంటి వారిని  మాత్రమే తీసుకుంటున్నాయి  చాతుర్యములు  లేని వారు  టీవీ  ముందు  కుర్చీలకు  పరిమితమయ్యారు.
కావున  నేర్చుకొనే వారికి  కావలిసిన శిక్షణ  కార్యక్రమాలు   అన్నివయసుల  వారికి అందించాలి

అధిక ఖర్చు తో కూడిన  ఆటలు  కుండా చేస్తున్నాయి ,ఉదా  టెన్నిస్ ,స్విమ్మింగ్ , వంటివి
కావున ఆయా క్రీడా  సంస్థలు  వాటిని ప్రజలకు  అందుబాటులోకి  తేవాలి ….

 

 

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *