సామ్ కరన్ తండ్రి కూడా క్రికెట్ ఆటగాడే

సామ్ కరన్

భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో 6 బంతులు విసిరి మూడు వికెట్లు తీసి, భారత టాప్ ఆర్డర్ ను చెదరగొట్టిన బౌలర్ సామ్ కరన్ అసలు పేరు “శామ్యూల్ మాథ్యూ కరన్” ఎడమచేతివాటం గల బ్యాట్స్మన్, ఎడమచేతి మీడియం ఫాస్ట్ బౌలర్. మొత్తానికి ఇంగ్లాండ్ టీమ్లో మంచి ఆలరౌండర్ గా మెప్పించాడు. సామ్ కరన్ కు 2018 జనవరిలో న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా సిరీస్ లో సెలెక్ట్ అయినప్పటికిని సామ్ కు ఆడే అవకాశం రాలేదు. అతనికి మొదటి టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం జూన్ 2018 లో లభించింది. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో shadab khan ను అవుట్ చేసి తన టెస్ట్ మ్యాచ్లో మొదటి వికెట్ సాధించాడు. మొదటి వన్డే 24 జూన్ 2018 ఆస్ట్రేలియాలో ఆడినాడు. 2016 అండర్-19 ప్రపంచ కప్లో ఆరు మ్యాచ్లు ఆడి 201 పరుగులు మరియు ఏడు వికెట్లు తీసి నాడు. భారత్ తో జరిగిన మ్యాచ్లో మురళీ విజయ్ ,కే. యల్ రాహుల్ ,శిఖర్ ధావన్ వికెట్లు పడగొట్టి టెస్ట్ క్రికెట్లో మూడు వికెట్లు తీసిన చిన్నవయసు వాడిగా రికార్డ్ సృష్టించాడు.

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సామ్ కరన్ తండ్రి మరియు సోదరులు కూడా క్రికెట్ ఆటగాళ్ళు

సామ్ కరన్ తండ్రి కెవిన్ కరన్ జింబంబే తరపున ఆడినాడు 1983 1987 ప్రపంచ కప్లో ఆడినాడు 2012లో జాగింగ్ చేస్తూ కుప్పకూలి మరణించాడు. సామ్ కరన్ సోదరుడు టామ్ కరన్ కూడా క్రికెట్ ఆటగాడు 2017లో టెస్ట్ క్రికెట్ మరియు వన్డే క్రికెట్లో అడుగు పెట్టినాడు అంతేకాకుండా ఐపీఎల్ 2018లో కోల్కత్తా నైట్రైడర్స్ జట్టులో ఆడినాడు.

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *