ఇరానియన్ మహిళా కబడ్డీ కోచ్ శైలజ జైన్ గురించితెలుసా?

2018 ఏసియన్ క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్ అయిన భారత్ ను 27-24 స్కోరుతో ఓడించిన ఇరాన్ మహిళ టీం గోల్డ్మెడల్ సొంతం చేసుకుంది అయితే గెలుపు వెనకాల ఒక భారతీయ మహిళ కష్టం దాగి ఉంది ఏడు నెలలుగా ఆమె యొక్క శిక్షణ ఫలితంగా ఈ విజయం దక్కింది.
ఆమె పేరే శైలజా జైన్ దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఆమెకు కబడ్డీ తో అనుబంధం ఉంది. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాకు చెందిన శైలజా జైన్ తల్లి కబడ్డీ క్రీడాకారిని అందువలన శైలజా జైన్ చిన్నప్పటినుంచి కబడ్డీ ఆడేది. ఆమె 1980లో వివాహం చేసుకుంది ఆమె గురించి పేపర్లో చూసి జైన్ కమ్యూనిటీలో క్రీడాకారిణిగా ఆమె ఎదగడం చూసి ఆమె భర్త ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత ఎన్. ఐ .ఎస్ .లో శిక్షణ తీసుకుంది అయితే ఆ సమయంలో ఆమె చాలా కష్టాలను ఎదుర్కొంది. ఆమె భర్త సంపాదన సరిపోయేది కాదు ఆ సమయంలో ఆమె మామ ఆమె కు డబ్బులు పంపి ఆదుకున్నాడు. శిక్షణ పూర్తి అయిన తర్వాత నాసిక్ లో కోచ్ గఉద్యోగం వచ్చింది. ఆ సందర్భంలో 9నెలల పాలు తాగే పసిపాపను కుటుంబం వద్ద వదిలి తాను ఉద్యోగం చేయడానికి వెళ్లింది నాసిక్ లో చాలా మంది ఆటగాళ్లను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దింది. 2008లో ఇరాన్ కోచ్గా ఆమెకు అవకాశం వచ్చినప్పటికీ ఇక్కడి ఉద్యోగం వదిలిపెట్టి వెళ్లిపోవడం ఇష్టంలేక తిరస్కరించింది.
అయితే 2014వ సంవత్సరంలో ఆమె ఉద్యోగ విరమణ పొందిన తర్వాత 2016లో మళ్లీ ఇరాన్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్లు ఆమెను అడగడం జరిగింది. అప్పటికి ఆమె వయసు అరవై ఒక్క సంవత్సరాలు ఈసారి ఆమె అంగీకరించింది. ఒక నెలపాటు ఇరాన్ లో శిక్షణ ఇచ్చి భారత్కు తిరిగి వచ్చింది. ఇక్కడకు తిరిగి రాగానే మళ్ళీ ఆమెను దీర్ఘకాలం శిక్షకురాలు గా కొనసాగిస్తూ ఇరాన్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏడు రోజుల వ్యవధిలో ఆమె మళ్లీ ఇరాక్ కు పయనమయ్యింది. జైన్ శాఖాహారి అవడంవల్ల ఇరాన్లో భోజనం విషయంలో చాలా కష్టపడింది. ఆమె ఇరాన్ జట్టుకు ఏడు నెలల పాటు శిక్షణ ఇచ్చింది. ఇరాన్ జట్టు సభ్యులు రగ్బీ ఫుట్బాల్ మరియు మార్షల్ ఆర్ట్ వంటి మొదలగు క్రీడలు ఆడడం వల్ల వారు భారత మహిళల జట్టు కంటే ఫిట్ గా ఉన్నారు అంతేకాకుండా టెక్నిక్స్ త్వరగా నేర్చుకున్నారు
శైలజా జైన్ టీం కోసం పార్సీ భాషను కూడా నేర్చుకున్నారు. అంతేగాక తనపై నమ్మకం ఉంచిన ఇరాన్కు కృతజ్ఞత తెలిపారు. ఇండియా ఓడిపోయినందుకు బాధగా ఉన్నప్పటికిని ఇరాన్ శిక్షకురాలు గా ఉన్నందున నేను ఇరా క్ గురించి ఆలోచించాలి అని ఆమె తెలిపింది. మొత్తానికి ఏదో ఒకరోజు ఆమె భారత మహిళా కబడ్డీ జట్టుకు కోచ్గా ఉంటుందని ఆశిద్దాం

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *