table tennis easay

టేబుల్‌ టెన్నిస్‌ ప్రధాన వ్యాసం: టేబుల్ టెన్నిస్ టెబుల్ టెన్నిస్‌ను ‘పింగ్‌పాంగ్ ‘గేమ్‌ అని కూడా అంటారు. కీ.శ.1880 లో ఇంగ్లాండ్‌లో ఈ గేమ్‌ మొదలైంది. ఈ గేమ్‌ యిద్దరు లేక నలుగురు ఆడెదరు. యిద్దరు ఆడినచో సింగిల్‌గేమ్‌ అని, నలుగురు ఆడినచో డబుల్స్‌ అంటారు. ఈ గేమ్‌ను మొదట్లో లంచ్‌ తరువాత విరామ సమయములో కాలక్షేపంగా ఆడేవారు. కాల క్రమేన ఈ గేమ్‌ యొక్క ప్రాముఖ్యత మారింది. కీ.శ.1988 లో ఒలంపిక్‌లో ఈ గేమ్‌ ఆడెటందుకు అనుమతి లభించినది.

తరువాత కీ.శ.2002 లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో అనుమతించబడినది. టేబుల్‌టెన్నిస్ యొక్క బోర్డ్‌ 9X5 అడుగుల సైజులో వుండును. గ్రౌండ్‌ నుండి బోర్డ్ 30″ అంగుళముల ఎత్తులో వుండును. బోర్డ్ కు మధ్యలో అడ్డంగా ఒక నెట్(net)కట్టబడి వుండును.ఈ నెట్‌ ఆరుఅంగుళముల ఎత్తు కలిగివుండును. ప్లేయరులు బోర్డ్‌కు ఇరువైపుల చివరలో నిలబడి ఆడేదరు. బ్యాట్‌ లేక రాకెట్‌ కొద్దిగా అండాకారములో వుండును. బ్యాట్‌ చెక్కతో చెయ్యబడి, రెండు పక్కల రబ్బరు షిల్డింగ్‌ కలిగి వుండును. రాకెట్ బ్లేడ్ వెడల్పు 6.0″ అంగుళములు, పొడవు 6.5″ అంగుళములు వుండును. బాల్‌ లేలికగా వుండు,లోపలి భాగములో గాలి వుండును. బాల్‌ సైజు 38-40 మి.మీ. వుండును. ప్రతి గేమ్‌లో11 పాయింట్్‌లు వుండును.ఎవ్వరు ముందుగా 11 పాయింట్ 6లు చెస్తారో అతను గెలచినట్లుగా ప్రకటిస్తారు. మొదటగా సర్వీసు చెయ్యు ఆటగాడు, బంతి మొదట తన వైపు కోర్ట్‌లో బౌన్స్‌అయ్యి ,తరువాత ప్రత్యర్ది కోర్ట్‌లోనికి వెళ్ళెలా కొట్టవలెను. ప్రత్యర్ది తిరిగి బంతిని, అవతలి కోర్ట్‌లోనికి వెళ్ళెలాకొట్టవలెను. అలా కొట్టలేక పోయిన పాయింట్ కొల్పొవును. ప్రతి ఆటకు ఆట గాళ్లు బోర్డ్‌సైడ్‌ మారెదరు. 3,5,7 ఇలా బేసి సంఖ్యలో ఆటలు ఆడి ఎక్కువ గేమ్‌లు గెలచిన వ్యక్తిని ఫైనల్‌గా గెలచినట్లుగా ప్రకటిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *