ఇప్పటివరకు చాలా టీమ్స్ వన్డే క్రికెట్ లో ౩౦౦పరుగులు సాధించాయి.ఒక్క సారి వాటిపైన ఒక లుక్కేదం .
మొట్ట మొదటి సారిగా వన్డే మ్యాచ్ ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగింది, ఈ మ్యాచ్ 1971 మెల్బోర్న్ లో జరిగింది .
అప్పటినుండీ నాలుగు సంవత్సరాల తరువాత అంటే జూన్ 7 ,1975 లో ఇంగ్లాండ్ మొట్ట మొదటి సారిగా వన్డే లో 300 పైన స్కోర్ సాధించింది .లార్డ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 334 పరుగులు చెసింది .ఇంతకీ ఎవరిమీద ఈ స్కోర్ చేశారో తెలుసా ఇండియా మీద .
అయితే అదే రోజు ఇంకో అద్భుతం కూడా జరిగింది అదేంటి అంటే యాదృచ్చికంగా బర్మింహం లో న్యూజిలాండ్ మరియు ఈస్ట్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ కూడా 309 పరుగులు సాధించింది .ఇలా ఒకే రోజు రెండు టీం లు 300 పైన స్కోర్ చేశాయి.ఆ తరువాత ఆస్ట్రేలియా మరియు పాకిస్థాన్ లు కూడ 300 స్కోర్ నమోదు చేసంది .
ఇక భారత దేశానికి వస్తే అప్పటివరకూ ట్రస్ట్ అర్హత గల టీమ్ ల ల్లో వన్డే లో 300 స్కోర్ చేసిన చివరి టీం.
1996 షార్జా లో పాకిస్థాన్ మీద 305 పరుగులు చేసింది .ఇక అప్పటినుండి భారత్ చాలా సార్లు వన్డేలో 300 స్కోర్ చేసింది .
2017 నాటికీ 100 కు పైగా మ్యాచ్ లలో 300 చేసిన టీం గ భారత్ నిలిచింది