- concussion rule ప్రకారం గాయపడిన ఆటగాని స్తానం లో సబ్స్టిట్యూట్ గ వచ్చే ఆటగాడికి బ్యాటింగ్ , బౌలింగ్ చేయవచ్చు .
- మార్నస్ లాబుస్చేన్ కాంకషన్ రూల్ ప్రకారం సబ్స్టిట్యూట్ గ వచ్చిన మొట్ట మొదటి ఆట గాడిగా నిలిచాడు .
ఆదివారం అషేస్ సిరీస్ లో ఇంగ్లాండ్ బౌలర్ ఆర్చర్ వేసిన బాల్ కు ఆస్ట్రేలియా బాట్స్ మాన్ స్టీవ్ స్మిత్ గాయ పడ్డాడు .అతని స్థానం లో కొత్త వచ్చిన” కాంకషన్ రూల్ ” ప్రకారం మార్నస్ లాబుస్చేన్ ను తీసుకున్నారు .ఆగుస్ట్ 1 నుండి ఈ రూల్ అమలు లో కి వచంది .మొట్ట మొదటగా అశేస్ సిరీస్ నుండి అమలు చేస్తున్నారు .
ఇప్పుడు పురుషుల ,మహిళల మరియు అన్నిరకాల క్రికేట్ ఫార్మాట్ లో ఇది అమలు చేయబడుతుంది .మొట్ట మొదటగా ఈ ” concussion rule ” ను ఆస్ట్రేలియా తన జాతీయ క్రికెట్ లో 2016 మరియు 17 లో ప్రవేశ పెట్టింది .ఆతరువాత ఇంగ్లాండ్ మరియు వేస్ల్స్ క్రికెట్ బోర్డ్ 2018 లో కాంకషన్ రూల్ ను ప్రవేశ పెట్టింది .
మంచి పలితాలు రావడం తో icc ఆటగాల్ల రక్షణకు ఇది ఉపయోగ కరంగా వుంటుంది అని బావించి అంతర జాతీయ మ్యాచ్ ల లో ప్రవేశ పెట్టింది .మరి కాంకషన్ రూల్ ను ఆస్ట్రేలియా తన జాతీయ మ్యాచ్ ల లో ఎందుకు ప్రవేశ పెట్టింది ?
2014 లో జరిగిన శిఫ్ఫిఎల్ద షీల్డ్ మ్యాచ్ లో Phillips Hughes అనే ఆట గాడు తలకు బలమయిన గాయం కావడం తో మరనించాడు .అతని మరణం ఈ concussion rule రావడానికి కారణం అయ్యింది .
మరి ఈ concussion rule తో వచ్చే సమస్య ఏంటి ?
icc నిబందనల ప్రకారం ఈ కాంకషన్ రూల్ లో like-for-like పద్ధతి ప్రకారం ఆటగాన్ని సబ్స్టిట్యూట్ గ తీసుకోవాలి . అనగా ఉదాహరణకు: ఫుట్ బాల్ గనక తీసుకుంటే అందులో ఒక డిఫెండర్ గనుక గాయపడితే అతని స్థానం లో మరొక డిఫెండర్ ఆటగాన్ని మాత్రమే తీసుకోవాలి .
అలాగే క్రికెట్ లో కూడా ఈ రూల్ పాటించాలి , ఉదాహరణకు:ఒక బాట్స్ మాన్ గాయపడితే అతని స్థానం లో మరొక బాట్స్ మాన్ ను మాత్రమే తీసుకోవాలి ,ఒకవేళ బౌలర్ గనక గాయపడితే బౌలర్ ను మాత్రమే తీసుకువాలి . కాంకషన్ ఆటగాన్ని నిర్ణయించే అధికారం మ్యాచ్ రేఫెరి కి వుంటుంది ,అని icc తెలుపుతుంది .
కాని కొన్ని పరిస్థితులు లో ఎలా వుంటుంది అనేది సమస్య ఉదాహరణకు: ఒక బౌలర్ గాయపడటం జరిగింది ,కాని ఆ టీం బాటింగ్ చేయల్సి వుంది అప్పుడు ఎలా? .ఒక టీం బాటింగ్ చేస్తూన్నది అనుకుందాము ఒక అల్ రౌండర్ గాయపడ్డాడు, అతని స్థానంలో కాంకషన్ రూల్ ప్రకారం బాట్స్మాన్ ను తీసు కుంటే అతను బౌలింగ్ చేయలేడు కదా.ఇక ఎలా వుంటుందో ముందు ముందు చూడాలి .